Malavya RajYoga: సాధారణంగా గ్రహాల గమనంలో మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి 15న శుక్రదేవుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీనరాశిలో శుక్రుడి సంచారం వల్ల అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడతారు. అంతేకాకుండా మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈ రాశులకు అన్ని విధాల ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): శుక్రుడు సంచారం వల్ల ఏర్పడిన  మాళవ్య రాజయోగం ఈ రాశి యెుక్క 11 వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈయోగం కారణంగా మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. షేర్ మార్కెట్‌, లాటరీలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు భారీగా లాభాలను గడిస్తారు. అంతేకాకుండా ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది.


కర్కాటకం (Cancer): కర్కాటక రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్ లో కొత్త దారులు తెరుచుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 


మీనం (Pisces): ఈ రాశిలోనే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి వీరికి అన్ని శుభాలే జరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఈసమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 


Also Read: Vasantha Panchami 2023: వసంత పంచమి నాడు ఈ మంత్రాలను పఠిస్తే.. ఉద్యోగంలో ప్రమోషన్ పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి