Mangal Dosha: కుటుంబంలో తరచుగా కలహాలుంటే.. వివాహం చివరి దాకా వచ్చి ఆగిపోతే, ఎలాంటి పనులు ప్రారంభించిన మధ్యలోనే ఆటంకాలు ఏర్పడితే.. ఇవన్నీ జాతకంలో మంగళదోషం సంకేతాలేనని జ్యోతి శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు జాతకంలో మొదటి, నాల్గవ, ఎనిమిది, పన్నెండవ స్థానంలో ఉంటే జాతకంలో మంగళదోషం ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ దోషాన్ని నివారించడం వల్ల చాలా మనిషి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే ఈ దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళదోషం ప్రభావం వల్ల మనిషి జీవితంలో కలిగే మార్పులు:
కోపం తెచ్చుకోవడం:

జాతకంలో మంగళదోషం ఉన్నవారు ఎప్పుడు ఆగ్రహానికి గురవుతారు. దీనితో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. కాబట్టి ఇలా తరచుగా కోపం తెచ్చుకునేవారు మంగళదోషం నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఇంద్రియాలు:
జాతకంలో మంగళదోషం ఉన్నవారు శృంగారానికి ఎక్కువగా అలవాటు పడతారు. అంతేకాకుండా ఇంద్రియ జ్ఞానం కూడా నషించే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు.


వివాహంలో జాప్యం:
జాతకంలో మంగళదోషం ఉన్నవారి వివాహంలో జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సార్లు ఖారారైన వివాహాలు కూడా చెడిపోయే అవకాశాలున్నాయి.


మంగళదోషం తొలగిపోవాలంటే ఈ నివారణ తప్పని సరి:
జాతకంలో మంగళదోషం తొలగిపోవాలంటే ఎర్రని పూల వస్త్రం, చందనం, పప్పు, గోధుమలు, కుంకుమపువ్వు, మైదా లేదా కస్తూరి దానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మంగళ రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. తీవ్ర మంగళ దోషం సమస్యలతో బాధపడేవారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఇంట్లో మంగళ యంత్రాన్ని స్థాపించి రోజూ పూజించాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి