Mangal Gochar 2022: జూన్ 27న మేష రాశిలో కుజుడి సంచారం.. 40 రోజులు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Mars transit to Aries on 27th June. గ్రహాల పుత్రుడైన కుజుడు జూన్ 27న తన సొంత రాశి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాంతో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవనుంది.
Leo and Libra zodiac sign will get huge money from 27th June: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం నిర్ణీత సమయ వ్యవధిలో తన రాశి చక్రాన్ని మారుస్తుంది. ఈ గ్రహ సంచారం కొందరికి అదృష్టంను తీసుకొస్తే, మరికొందరికి దురదృష్టంను కలిగిస్తుంది. గ్రహాల పుత్రుడైన కుజుడు జూన్ 27న తన సొంత రాశి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంగారకుడి సంచారము అన్ని రాశులపై పెను ప్రభావం చూపుతుంది. కొందరికి సానుకూల ఫలితాలు వస్తే.. మరికొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేవో ఓసారి చూద్దాం.
మేష రాశి:
కుజుడు జూన్ 27న మేష రాశిలోకి ప్రవేశించి 40 రోజుల పాటు (ఆగస్టు 10) అక్కడే ఉండనున్నాడు. మేష రాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంది. కెరీర్‌లో మంచి ఫలితాలు పొందుతారు. మీకు భాగస్వామ్యం ఉన్నా మంచి లాభాలను పొందవచ్చు. ఈ మార్స్ సంచారము ఉద్యోగస్తులకు కూడా లాభదాయకం. ప్రొమోషన్, కీర్తి పెరుగుతాయి. మరోవైపు ప్రేమికులు కూడా సక్సెస్ అవుతారు.
మిథున రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ సంచారం మిథున రాశి వారికి కూడా మేలు చేస్తుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో మీ పని మెరుగుడపడుతుంది. దాంతో ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పోలీసు, సైన్యం లేదా పారామిలటరీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
సింహ రాశి:
ఈ సమయంలో ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ విజయానికి అవకాశం ఉంది. ఈ సమయం పెట్టుబడికి చాలా అనుకూలమైనది. ఆదాయం పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కానున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు.
తుల రాశి:
కుజ సంచారం తుల రాశి వారికి కూడా మేలు చేస్తుంది. మీరు భాగస్వామ్యంతో పని చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీతభత్యాలు ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. ఈ కాలం కెరీర్‌కు మంచి సమయం. అయితే తుల రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో కాస్త సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
Also Read: Secunderabad Agnipath Protests: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!
Also Read: Godse Movie Review : 'సత్యదేవ్-గోపీ గణేష్'ల గాడ్సే సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook