Godse Movie Review : 'సత్యదేవ్-గోపీ గణేష్'ల గాడ్సే సినిమా ఎలా ఉందంటే?

Godse Movie Review : బ్లఫ్ మాస్టర్ వంటి సినిమా చేసిన గోపీ గణేష్ తో సత్యదేవ్ రెండో సినిమా కావడంతో గాడ్సే  సినిమా ప్రకటించినప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఆ అంచనాలను టీజర్, ట్రైలర్లు మరింత పెంచాయి. గాడ్సే  ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 01:10 PM IST
  • గోపీ గణేష్ తో సత్యదేవ్ రెండో సినిమా
  • ప్రకటించినప్పుడే అంచనాలు
  • ప్రకటించినప్పుడే మంచి అంచనాలు
Godse Movie Review : 'సత్యదేవ్-గోపీ గణేష్'ల గాడ్సే సినిమా ఎలా ఉందంటే?

Godse Movie Review : హీరో పాత్రలకే పరిమితం అవకుండా ఎలాంటి పాత్ర అయినా చేస్తూ ప్రేక్షకుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈ శుక్రవారం నాడు గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో బ్లఫ్ మాస్టర్ వంటి సినిమా చేసిన గోపీ గణేష్ తో రెండో సినిమా కావడంతో ఈ సినిమా ప్రకటించినప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.  ఆ అంచనాలను టీజర్, ట్రైలర్లు మరింత పెంచాయి. దీంతో మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.  
 
గాడ్సే కథ ఏంటి?
డ్యూటీ ఫస్ట్ పర్సనల్ లైఫ్ నెక్స్ట్ అనుకునే ఏసీపీ వైశాలి(ఐశ్వర్య లక్ష్మీ) చేతుల్లో ఒక గర్భవతి అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. రాజీనామా చేసిన తర్వాత అనూహ్యంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన పిలుపుతో గాడ్సే(సత్యదేవ్) అనే ఒక కిడ్నాపర్ తో నెగోషియెట్ చేయడానికి కూర్చోవాల్సి వస్తుంది. అయితే ఒక రాష్ట్ర మంత్రి,  ఒక ఎస్పీ,  కొందరు సీఏలను గాడ్సే ఎందుకు కిడ్నాప్ చేశాడు? లండన్లో బిజినెస్ మాన్ అయిన గాడ్సేకి ఎందుకు వాళ్ళను కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేసిన అందరినీ ఏం చేశాడు? అసలు గాడ్సే పట్టుపట్టి వైశాలినే అందుకు పిలిపించాడు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కనుక సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
విశ్లేషణ:
సినిమా మొదటి భాగంలో కొందరిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో అసలు ఎందుకు చేస్తున్నారు? అనే ఆసక్తి పెంచారు. సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చాక సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. ఆ తర్వాత అసలు కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు? అసలు అతని మోటివ్ ఏంటి? అనే ఆసక్తి పెంచడంతో సఫలమైన దర్శకుడు కొంత మేర ల్యాగ్ అనిపించినా రెండో భాగం మీద ఆసక్తి పెంచాడు. ముందు గాడ్సే మీద కోపం తెప్పించిన దర్శకుడు తరువాత అసలు కధలోకి వెళ్ళిన తరువాత మాత్రం ఆలోచింప చేసేలా రాసుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ లక్షల కోట్ల అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలు లేవనెత్తి  చాలా కన్వీనియంట్ గా ప్రేక్షకులను ఆలోచింప చేశాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా రెండో భాగంలో సత్యదేవ్ పలికే అన్ని డైలాగ్స్ కు మంచి స్పందన వచ్చేలా రాసుకున్నాడు. 
 
నటీనటుల విషయానికి వస్తే :
ఈ సినిమాతో తను మంచి నటుడిని అని సత్యదేవ్ మరో మారు నిరూపించుకున్నాడు. సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నా సత్యదేవ్ అందరినీ డామినేట్ చేసేశాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. నోయల్ కు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ప్రియదర్శి, నాగబాబు లాంటి వారు కనిపించే ఒకటిరెండు సీన్లే అయినా ఆకట్టుకున్నారు. పృథ్వి రాజ్ కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 
  
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే బ్లఫ్ మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న గోపీ గణేష్ తన రెండో సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే నిరుద్యోగం, రాజకీయ నాయకుల లంచాలు లాంటి అంశాలను స్పృశించి ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా కంటే రచయితగా ఆయన వర్క్ ఆకట్టుకుంది. రెండో భాగంలో వచ్చే డైలాగ్స్ అందరినీ అలరిస్తూనే ఆలోచింప చేసేలా రాసుకున్నాడు. కొంత సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకట్టుకునే పాటలు పెద్దగా లేకపోయినా సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. సురేష్ అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
ఫైనల్ గా:
ప్రస్తుత రాజకీయాల మీద సత్యదేవ్ బాణంగా గోపీ గణేష్ ఎక్కు పెట్టిన విమర్శనాస్త్రమే గాడ్సే సినిమా. నిరుద్యోగం,  అవినీతి, కొన్ని విషయాల్లో మీడియా హడావుడి వంటి విషయాలే ప్రధాన కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుంది. రోజూ మనం వార్తల్లో చూసే అంశాలనే ఒక కథగా మలుచుకుని మన ముందుకు తీసుకొచ్చారు. 
  
రేటింగ్: 2.75/5

Also Read: Virataparvam Review: రానా, సాయిపల్లవిల 'విరాటపర్వం' రివ్యూ అండ్ రేటింగ్‌

Also Read : Nagababu: గాడ్సే నిజమైన దేశభక్తుడు: నాగబాబు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News