Mangal Gochar 2023 Effect: ఏర్పడనున్న నీచభంగ రాజయోగం.. జూలై 1 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు
Mangal Gochar 2023 Effect: గ్రహాల కమాండరైన కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. అంగారక సంచారం వల్ల ఏయే రాశుల వారు లాభాలు పొందనున్నారో తెలుసుకుందాం.
Mars Transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహమని పిలుస్తారు. ఇతడిని ధైర్యసాహసాలకు కారకుడిగా భావిస్తారు. గ్రహాల కమాండరైన కుజుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావం చూపుతుంది. రీసెంట్ గా మార్స్ కర్కాటకరాశిలో సంచరించాడు.
ఇతడు జూలై 01 వరకు అదే రాశిలో ఉంటాడు. కర్కాటక రాశిలో అంగారకుడు చాలా నీచంగా లేదా బలహీన స్థితిలో ఉంటాడు. దీని కారణంగా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. కుజుడి గోచారం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి యెుక్క నాల్గో ఇంటిలో అంగారకుడు సంచరించాడు. కుజుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పోలీసు, సైన్యం మరియు క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీరు ఆర్థికంగా కూడా బలపడతారు.
Also Read: Shash Rajyog: జాతకంలో ఈ రాజయోగం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు..!
కర్కాటక రాశి
ఇదే రాశిలో అంగారక సంచారం జరిగింది. ఈ రాశి యెుక్క లగ్న గృహంలో కుజుడు కూర్చున్నాడు. దీని కారణంగా మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది.
తుల రాశి
కుజుడు సంచారం తుల రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ జాతకంలోని 10వ ఇంట్లో అంగారకుడు సంచారం జరిగింది. దీని కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ డ్రీమ్ అన్నీ నెరవేరుతాయి. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. మీకు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook