Mars transit 2023: సూర్యుని రాశిలోకి కుజుడు... ఈ 4 రాశులకు లక్కే లక్కు!
Mangal Gochar 2023 in Leo: జూలై 07న అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుజుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mangal Gochar 2023 in Simha Rashi: ఆస్ట్రాలజీలో కుజుడిని ధైర్యం, భూమి మరియు వివాహానికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. అదే అతడు అశుభ స్థానంలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. జూలై 07న తేదీన అంగారకుడి సంచారం జరగబోతుంది. కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
అంగారక సంచారం ఈ రాశులకు లాభదాయకం
వృషభం- కుజుడు రాశి మార్పు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఏదైనా అస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ జీవితంలో దేనికీ లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి.
సింహ రాశి- అంగారక సంచారం సింహరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు.
Also Read: Surya Gochar 2023: బుధుడు రాశిలో శక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
ధనుస్సు- కుజుడు సంచారం ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ మెుదలవుతాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
వృశ్చిక రాశి - మార్స్ సంచారం వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. డబ్బు రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఊహించని ధనలాభం పొందుతారు.
Also Read: Mercury transit 2023: జూన్ 24 నుంచి ఈ 5 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook