Mangal Gochar Effect 2022:  ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా గ్రహం యొక్క సంచారం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తుంది. ఈ రోజు అంటే ఆగష్టు 10 రాత్రి 9:43 గంటలకు కుజుడు తన స్వంత రాశి అయిన మేషాన్ని వదిలి వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022) ప్రవేశించబోతున్నాడు. ఇప్పటి వరకు రాహువుతో కలిసి మేషరాశిలో ఉన్న అంగారకుడు కొన్ని రాశులవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. నేటి నుండి ఆ రాశులకు విముక్తి లభించనుంది. వృషభరాశిలో కుజ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభంగానూ ఉంటుంది. ఏయే రాశిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై చెడు ప్రభావం
మేషం (Aries)- ఈ రాశి వారికి ఈ సమయం కష్టాలతో నిండి ఉంటుంది. జీవితంలో అనేక రంగాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ టైంలో ఖర్చులు నియంత్రించుకోవాలి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.  


మిథునం (Gemini)- కుజుడు సంచారం ఈ రాశుల వారి జీవితాలపై చెడు ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇతరులతో వివాదాలు రావచ్చు.


తుల రాశి (Libra)- ఈ సమయం తులారాశి వారికి సవాళ్లతో నిండి ఉంటుంది. ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.  మీ జీవితంలో చెడు విషయాలు జరగవచ్చు.


ఈ రాశులపై శుభ ప్రభావం
వృషభం (Taurus)- వృషభ రాశి వారికి ఈ సమయం లాభదాయకం. కుజుడు ఈ రాశిలోనే సంచరించబోతున్నాడు కాబట్టి ఈ రాశివారికి గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. ఉద్యోగంలో రాణిస్తారు. వ్యాపార లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 


కర్కాటకం (Cancer)- అంగారక సంచారం వీరికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడితే ఈ సమయంలో ఆ వర్క్స్  పూర్తయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. డబ్బు కష్టాలు పోతాయి. 


సింహం (Leo)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి కుజ సంచారం శుభప్రదం కానుంది. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Mars Transit August 2022: అంగారక సంచారం.. ఈ 4 రాశుల అదృష్టం మారడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook