Rahu and Mars Conjuction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారాలు, గ్రహాల గమనంలో మార్పులే కాదు గ్రహాల సంయోగం కూడా రాశిచక్రంపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహాల కలయిక అనేక రకాల శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంది. ఈ యోగాలు ఆయా రాశులపై గట్టి ప్రభావాన్ని చూపుతాయి. జూన్ 27న రాహువు-కుజుడు సంయోగం చెందబోతున్నారు. అంటే.. ఒకే రాశిలో ఈ గ్రహాల కలయిక జరుగుతోంది. దీన్నే అంగారక యోగం అని కూడా పిలుస్తారు. ఈ కలయిక 3 రాశుల వారిపై తీవ్ర  ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక యోగం ప్రభావం :


వృషభం: వృషభ రాశి వారికి కుజుడు-రాహువు కలయిక మంచిది కాదు. ఇది వారికి ఆర్థిక సమస్యలు సృష్టిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అదే సమయంలో తోబుట్టువులతో విభేదాలు రావొచ్చు. కాబట్టి ఈ సమయంలో కాస్త ఓపిక, సంయమనం అవసరం. శత్రువుల వల్ల నష్టం జరగవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెద్ద పెద్ద ఒప్పందాలకు ప్రస్తుతానికి దూరంగా ఉండటం మంచిది.


సింహం: అంగారక యోగం వల్ల సింహరాశి వారిని దురదృష్టం వెంటాడుతుంది. ఏ పని చేసినా తప్పులు దొర్లుతాయి. దూర ప్రయాణాలను అనుకోకుండా రద్దు చేసుకోవాల్సి రావొచ్చు. వ్యాపారంలో జరిగే పెద్ద డీల్స్ రద్దు కావొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పొట్ట సంబంధిత సమస్యలు బాధించవచ్చు.


తుల: కుజుడు-రాహువు కలయిక తులారాశి వారి జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచీ తూచీ మాట్లాడాలి. లేనిపక్షంలో గొడవల్లో చిక్కుకోవచ్చు. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)



Also Read: Big Shock TO Kcr: కేసీఆర్ కు షాక్ ల మీదు షాకులు.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే ! త్వరలో కొందరు సీనియర్లు జంప్?


Also Read: Friday Lakshmi Puja: శుక్రవారం లక్ష్మీ దేవి పూజ.. ఈ స్త్రోత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.