Mangal Margi Effect:  జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని అన్ని గ్రహాలకు కమాండర్ అని పిలుస్తారు. అటువంటి కుజుడి రాశిలో మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. నిన్నటి వరకు తిరగోమనంలో ఉన్న కుజుడు.. ఇవాళ మార్గంలోకి రానుంది. అంగారుకుడు అక్టోబర్ 30 వరకు వృషభరాశిలోనే ఉంటాడు. మార్స్ సంచారం (Mangal Margi 2023) కొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉండవచ్చు. కుజ మార్గి వల్ల ఏయే రాశుల వారు సమస్యలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్స్ మార్గి ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
వృశ్చిక రాశి (Scorpio): కుజుడు ప్రత్యక్ష సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి కీడు చేస్తుంది. ఈ సమయంలో మీరు మా కోపాన్ని లేదా మాటలను అదుపులో పెట్టుకోండి, లేకపోతే చిక్కుల్లో పడతారు. ఏదైనా పనిచేసేటప్పుడు ఏకాగ్రతతో చేయండి, లేకపోతే మీరు నష్టపోతారు.  
వృషభం (Taurus): వృషభరాశిలో అంగారకుడు కదలిక ఈ రాశివారిపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు కొత్త పనులు చేయడం మానుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుజుడు సంచారం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. 


మిధునరాశి (Gemini): మార్స్ సంచారం వల్ల మిథునరాశి వారి జీవితాల్లో గందరగోళం ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దక్కదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. 
తులారాశి (Libra): తుల రాశి వారికి కుజుడు ప్రత్యక్ష సంచారం అశుభం కానుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. 


ఈ పరిహారం చేయండి
అంగారకుడి ప్రతికూల ప్రభావాలు మరియు దోషాలను నివారించడానికి కార్తికేయుడిని ఆరాధించండి. అంతేకాకుండా మీరు హనుమాన్ ను పూజించడం వల్ల మంగళ దోషం కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా కాలభైరవుడిని ఆరాధించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 


Also Read: Mangal Margi 2023: వృషభరాశిలో కుజుడు ప్రత్యక్ష సంచారం... ఈరోజు నుంచి ఈరాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి