Mangal-Shukra Yuti In Leo:  జూలై నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి.  జూలై 01న అంగారుకుడు, జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించారు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడింది. సింహరాశిలో కుజుడు శుక్రుడు సంయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
అంగారకుడు మరియు శుక్ర గ్రహాల కలయిక కూడా మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలోని ఐదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయంలో సడన్ గా పెరుగుదల ఉంటుంది. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. 


కర్కాటక రాశి
సింహరాశిలో కుజుడు, శుక్రుడు ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారు మంచి లాభాలను పొందబోతున్నారు. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆఫీసులో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


కుంభ రాశి
సింహరాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశిచక్రంలోని ఏడవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీకు కొత్త ఆదాయ మర్గాలు ఏర్పడతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. పెళ్లికాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ చేసే పనుల్లో విజయం ఉంటుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది.  మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook