Mangal Vakri In Mithun 2022: జ్యోతిషశాస్త్రంలో మార్స్ ను గ్రహాల కమాండర్ గా పిలుస్తారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ధైర్యవంతుడు అవుతాడు. ప్రస్తుతం మిధునరాశిలో సంచారంలో ఉన్న అంగారకుడు.. ఇవాళ అంటే అక్టోబరు 30న అదే రాశిలో తిరోగమనం (Mars Retrograde in Gemini 2022) చేయబోతున్నాడు. దీని తిరోగమనం ప్రభావం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఈ సమయంలో వీరు అపారమైన డబ్బును పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుజుడు తిరోగమనం ఈ మూడు రాశులకు శుభప్రదం
సింహం (Leo): అంగారకుడి తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. డబ్బును ఆదా చేస్తారు. వ్యాపారుల కొత్త కొత్త ఆర్డర్లు పొందుతారు. మీ రాశి నుండి 11వ ఇంట్లో కుజుడు తిరోగమనం చేయనున్నాడు. దీంతో ఈరాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. 


మీనం (Pisces): ఈరాశి యెుక్క నాల్గో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. అంగారకుడి తిరోగమనం ఈరాశివారికి వృత్తి, వ్యాపార పరంగా కలిసి వస్తుంది. తల్లితో అనుబంధం బాగుంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పుష్పరాగం ధరించడం వల్ల మేలు జరుగుతుంది. 


వృషభం (Taurus): కుజుడు మీ రాశి నుండి రెండవ ఇంటికి వెళ్ళబోతున్నాడు. దీంతో వీరు వ్యాపారంలో భారీగా డబ్బును సంపాదిస్తారు. మీరు మీరు కెరీర్ పరంగా చాలా మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. ఈ సమయంలో ఒపల్ రాయిని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


Also Read: Mahapurusha Raja Yoga: 'మహాపురుష రాజయోగం' చేస్తున్న తిరోగమన కుజుడు.. ఈ రాశులకు లాభాలు బోలెడు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook