Mars retrograde 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణించడమో లేదా తిరోగమనం చెందడమో చేస్తుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. దైర్యానికి ఇచ్చే అంగారకుడు ప్రస్తుతం మిథునరాశిలో తిరోగమనంలో (Mars retrograde in Gemini 2022) ఉన్నాడు. 73 రోజులపాటు అతడు అదే స్థితిలో ఉంటాడు. సాధారణంగా తిరోగమనంలో ఉన్న ఏ గ్రహమైనా మంచి ఫలితాలను ఇవ్వదు. కానీ కుజుడు తిరోగమనం మూడు రాశులవారికి అపారమైన సంపదను మరియు పురోగతిని ఇస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం (Aquarius): జెమినిలో అంగారకుడి తిరోగమనం ఈరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క ఐదో ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు కుజుడు. దీన్ని పిల్లలు మరియు ఉన్నత విద్యల ప్రదేశం అంటారు. ఈ సమయంలో మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. మీకు శక్తి, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.


సింహం (Leo): అంగారకుడి తిరోగమనం సింహ రాశి వారికి వృత్తి మరియు వ్యాపారాల్లో విజయాన్నిస్తుంది.  ఎందుకంటే మీ రాశి యెుక్క 11వ ఇంట్లో అంగారకుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా పరిగణిస్తారు. మీ ఖర్చులు పెరుగుతాయి. అదే విధంగా ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుని లాభాలను ఆర్జిస్తారు. 


వృషభం (Taurus): అంగారకుడి తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే అంగారక గ్రహం మీ రాశి నుండి మరొక ప్రదేశానికి తిరోగమనం చెందింది. ఇది ప్రసంగం మరియు డబ్బు యొక్క ప్రదేశంగా భావిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగుల కల ఫలించి.. కొత్త ఉద్యోగం వస్తుంది.


Also Read: Budh Gochar 2022: ధనుస్సు రాశిలోకి బుధుడు... ఎవరికి లాభం, ఎవరికి నష్టం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U   


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook