Mangala Gauri Vrat 2022:  ఇవాళ శ్రావణ మాసంలో రెండో మంగళ గౌరీ వ్రతం. విశేషమేమిటంటే... మంగళ గౌరీ వ్రతంతో పాటు శ్రావణ శివరాత్రి కూడా ఇదే రోజు రావడం. అఖండ సౌభాగ్యం కోసం వివాహితులు ఈ మంగళగౌరీ వ్రతాన్ని (Mangala Gowri vratham 2022) చేస్తారు. పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు. దీంతో వారి కోరికలు నెరవేరుతాయి. మంగళ గౌరీ వ్రతం యొక్క ముహూర్తం, పూజా విధానం గురించితెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ మహూర్తం
త్రయోదశి తిథి: సాయంత్రం 04:15 నుండి ఈరోజు సాయంత్రం 06:46 వరకు
చతుర్దశి తిథి: ఈరోజు సాయంత్రం 06:46 నుండి రేపు రాత్రి 09:11 వరకు
నేటి శుభ సమయం లేదా అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:00 నుండి 12:55 వరకు


పూజా విధానం
మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఆ తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పార్వతీపరమేశ్వరులు, వినాకుడి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టండి. పూజ ప్రారంభించండి. గణపతికి పూలు, అక్షత, గంధం, రోలి, కుంకుడు మొదలైన వాటిని సమర్పించండి. ఆ తర్వాత మాత మంగళ గౌరీకి కుంకుమ, పసుపు, ఎర్రటి పూలు, పండ్లు, మేకప్ మెటీరియల్ మొదలైన వాటిని సమర్పించండి. దీని తరువాత, శివునికి బిల్వ పత్రాలు, తెల్లటి పువ్వులు, దాతురా,  పండ్లు, చందనం మొదలైన వాటిని సమర్పించండి. ఆ తర్వాత మంగళ గౌరీ చాలీసా మరియు మంగళ గౌరీ వ్రత కథ చదవండి లేదా వినండి. ఆ తర్వాత మా మంగళ గౌరీకి నెయ్యితో దీపం వెలిగించి.. చివరగా హారతి ఇవ్వండి.  మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత పారణ చేస్తూ ఉపవాసాన్ని విరమించండి.  


Also Read: Sravana Shivratri 2022: చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు శ్రావణ శివరాత్రి, మంగళగౌరీ వ్రతం.. శుభ ముహూర్తం ఇదే!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook