Sravana Shivratri 2022: చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు శ్రావణ శివరాత్రి, మంగళగౌరీ వ్రతం.. శుభ ముహూర్తం ఇదే!

Sravana Shivratri 2022 Date: హిందువులకు శ్రావణ మాస శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి రోజే మంగళగౌరీ వ్రతం కూడా వస్తుంది. దీంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత పెరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 03:52 PM IST
Sravana Shivratri 2022: చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు శ్రావణ శివరాత్రి, మంగళగౌరీ వ్రతం.. శుభ ముహూర్తం ఇదే!

Sravana Shivratri 2022: శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో శివారాధన చేయాలి. శ్రావణంలోని సోమవారాలు, ప్రదోష వ్రతం, శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి (Sravana Shivratri 2022) రేపు అంటే 26 జూలై 2022, మంగళవారం జరుపుకోనున్నారు. అంతేకాకుండా ఈ రోజున మంగళగౌరీ వ్రతం (Mangala Gowri vratam 2022) కూడాపాటిస్తారు. దీంతో శివపార్వతుల అనుగ్రహం మీకు లభిస్తుంది. 

ఈ ఏడాది శ్రావణ మాసంలో శివరాత్రి, మంగళగౌరీ వ్రతం ఒకరోజు రావడం యాదృచ్ఛికమనే చెప్పాలి.  చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి దృగ్విషియం ఏర్పడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి.. పార్వతీపరమేశ్వరులను పూజించండి. తద్వారా వారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ దూరమవుతాయి. 

శుభ ముహూర్తం
శ్రావణ మాస శివరాత్రి జూలై 26న సాయంత్రం 06:45 గంటలకు ప్రారంభమై.. జూలై 27న రాత్రి 09:10 వరకు ఉంటుంది. ఈ విధంగా జూలై 26 మరియు 27వ తేదీలలో శివుని జలాభిషేకం చేయవచ్చు. శివరాత్రిలో చార్ పహార్ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజున నాలుగు ప్రహస్లను పూజిస్తే పురుషార్థ, ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. మరోవైపు, శ్రావణ శివరాత్రిని పూజ చేసుకోవడానికి  ఉత్తమ సమయం సాయంత్రం 06:30 నుండి 07:30 వరకు.

Also Read: Lucky Girl by Zodiac Sign: ఈ రాశిచక్ర గుర్తుల అమ్మాయిలు మనల్ని తొలిచూపులోనే పడేస్తారు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News