March Month Taurus Horoscope: వృషభ రాశి మార్చి నెల ఫలాలు.. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన పూర్తి వివరాలు..
March Month Taurus Horoscope 2024: మార్చి నెలలో జరిగే గ్రహ సంచారాల కారణంగా మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ సమయంలో వీరికి కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నెల మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
March Month Taurus Horoscope 2024 In Telugu: మార్చి నెలలో జరిగే గ్రహసంచారాల కారణంగా వృషభ రాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది దీనికి కారణంగా వీరు అనేక రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వృషభరాశి వారు మార్చి నెలలో తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఒత్తిడికి లోనై అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సమయంలో తప్పకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా, వ్యక్తిగత జీవిత పరంగా ఎలా ఉండబోతుందో మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారతణ ఫలాలు:
ఈ నెల మీకు కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు, కానీ అదే సమయంలో అవకాశాలను కూడా అందిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో దృఢంగా ఉంటేనే విజయం సాధిస్తారు.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా మేలు.
మీ కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
వృత్తి:
మీ వృత్తిలో కొన్ని మార్పులు రాబోతున్నాయి.
వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించవచ్చు. ఇక ఉద్యోగాలు చేసేవారు, కొత్త ఉద్యోగాలు పొందుతారు.
మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
మీ ఉన్నత అధికారుల నుంచి సపోర్ట్ పొందుతారు.
ఆర్థిక పరిస్థితులు:
ఈ నెల మీకు ఆర్థికంగా మంచిది.
మీ ఆదాయం పెరిగి, ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా డబ్బులను పొదుపు చేసే ఛాన్స్ కూడా ఉంది.
పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. కాబట్టి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకండి.
వ్యక్తిగత జీవితం:
మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు.
మీరు మీ భాగస్వామితో కొన్ని విభేదాలను ఎదుర్కోనే అవకాశాలు ఉన్నాయి.
మీరు ఓపికగా ఉండాల్సి ఉంటుంది. మీ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పని చేయాలి.
ఒంటరిగా ఉండేవారికి తప్పకుండా తోడు లభిస్తుంది.
పరిహారాలు:
ప్రతిరోజూ శివుడిని పూజించడం చాలా మంచిది.
"ఓం నమః శివాయ" మంత్రాన్ని జపించండి.
గురువారం రోజు పేదలకు అన్నదానం చేయండి.
నక్షత్ర ఫలాలు:
కృత్తిక: ఈ మార్చి నెల మీ చాలా బాగుంటుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం వల్ల సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
రోహిణి: ఈ నెల మీకు కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్చి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించాలి.
మృగశిర: ఈ సంవత్సరంలోని మార్చి నెల మీకు ఆర్థికంగా చాలా మంచిది. దీంతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది.. ఖర్చులు తగ్గుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter