Marriage Tips: పెళ్లి ఆలస్యమైనా..ఆటంకాలు ఎదురైనా ఇలా పూజలు చేస్తే చాలు
Marriage Tips: కొంతమందికి పెళ్లి ఆలస్యమవుతుంటుంది. ఇంకొంతమందికి పెళ్లి నిలిచిపోతుంటుంది. కుండలిలో దోషముంటేనే ఇలా జరుగుతుందని అంటున్నారు పండితులు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Marriage Tips: కొంతమందికి పెళ్లి ఆలస్యమవుతుంటుంది. ఇంకొంతమందికి పెళ్లి నిలిచిపోతుంటుంది. కుండలిలో దోషముంటేనే ఇలా జరుగుతుందని అంటున్నారు పండితులు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
మీకు జీవిత భాగస్వామి లభించడం లేదా, మీరు ఇష్టపడేవ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో ఆలస్యమౌతోందా. లేదా ఏదైనా సమస్య ఎదురౌతోందా..కొన్ని పద్ధతుల్ని ఆచరించడం ద్వారా మంచి జీవిత భాగస్వామిని పొందవచ్చు. ఈ పద్ధతులు చాలా సులభమైనవే. ఫలితాలు మాత్రం బాగుంటాయి. పెళ్లి విషయంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని దూరం చేయవచ్చు.
జీవిత భాగస్వామి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే..కృష్ణ భగవానుడి ఆలయంలో వేణు, పాన్ సమర్పించాలి. దీనివల్ల మీ జీవితంలో త్వరలోనే ప్రేమ చిగురిస్తుంది. ఒకవేళ ప్రేమికురాలితో పెళ్లి విషయంలో ఇబ్బంది ఎదురవుతుంటే..దుర్గాదేవిని పూజించాలి. శుక్రవారం నాడు ఎర్ర జెండా లేదా ఎర్రటి చున్నీ సమర్పించాలి. ఇలా చేస్తే త్వరగా పెళ్లవుతుంది. మంచి జీవిత భాగస్వామిని పొందేందుకు శివుడిని ఆరాధించాలి. 16 సోమవారాలు వ్రతం ఆచరించాలి. సోమవారం నాడు శివలింగాన్ని తేనెతో అభిషేకించాలి. ఇలా చేస్తా మీ కోరికలు నెరవేరుతాయి.
కుండలిలో గ్రహదోషం కారణంగా పెళ్లి ఆలస్యమవుతుంటే..విష్ణు భగవానుడు, లక్ష్మీదేవిని పూజించాలి. శుక్లపక్షం గురువారం నాడు ఓం లక్ష్మీ నారాయణ నమహ మంత్రాన్ని స్పటిక మాలతో జపించాలి. తరువాత 3 నెలలవరకూ గురువారం నాడు ఆలయంలో పసుపు రంగు స్వీట్స్ సమర్పించాలి. గురువారం నాడు పసుపు, శుక్రవారం నాడు తెలుపు రంగు బట్టలు ధరిస్తే..కుండలిలో గురు, శుక్ర గ్రహాలు బలోపేతమై..త్వరగా పెళ్లవుతుంది.
ఒకవేళ పెళ్లిలో సమస్యలు ఎదురైతే..ప్రేమికులిద్దరూ శనివారం, అమావాస్య రోజుల్లో కలవకుండా ఉండాలి. శుక్రవారం పౌర్ణమి రోజున కలిసి గడిపితే మరీ మంచిది. దీనివల్ల ప్రేమపై నమ్మకం పెరుగుతుంది. రాధాకృష్ణ ఆలయంలో కృష్ణుడికి పూలమాల, పటికబెల్లం సమర్పించాలి. దీనివల్ల అన్ని సమస్యలు దూరమౌతాయి.
Also read: Astro tips for money: మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోతే చిటికెలో తిరిగి వస్తుంది.. ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook