Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి విశిష్టత ఉన్నట్టే మంగళ గ్రహానికి మహత్యముంటుంది. మంగళ గ్రహాన్ని శుభప్రదానికి సూచికగా భావిస్తారు. మంగళ గ్రహం ఆశీస్సులు లేకుండా ఏ వ్యక్తీ పురోగతి సాధించలేడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనం సంక్షేమం, బాగోగులు చూసే మంగళ గ్రహం సెప్టెంబర్ 24వ తేదీన  బుధుడి రాశి కన్యలో గోచారం చేయనున్నాడు. ఫలితంగా మూడు రాశుల జీవితాలపై దుష్ప్రభావం పడనుంది అంటే ఈ మూడు రాశులకు అంతా అశుభమే ఎదురుకానుంది. కుండలిలో మంగళ గ్రహం పటిష్టంగా ఉంటే ఆ వ్యక్తికి వివిధ రకాలుగా శారీరక , మానసిక సుఖం కలుగుతుంది. మంగళ గ్రహం కటాక్షం లేకుంటే ఏ వ్యక్తి కూడా ప్రయోజకుడు కాలేడు.సెప్టెంబర్ 24న మంగళ గ్రహం కన్యా రాశిలో అస్తమించనున్నాడు. ఫలితంగా మూడు రాశులకు తీవ్రమైన సమస్యలు ఎదురుకానున్నాయి. మంగళ గ్రహం అస్తమించినంతవరకూ ఈ మూడు రాశులకు అంతా అశుభమే ఎదురుకానుంది. ఊహించని కష్టాలు కూడా ఎదురుకావచ్చు.


మంగళ గ్రహం అస్తమించడం వల్ల సింహ రాశి జాతకులకు తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడవచ్చు. ఆదాయం తగ్గనుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో తీవ్రమైన కష్టాలు ఎదురౌతాయి. అందుకే ఈ సమయం జాగ్రత్తగా గడపాల్సి వస్తుంది. 


ఇక మంగళ గ్రహం కన్యా రాశిలో అస్తమించడం వల్ల మీన రాశి జాతకులకు తీవ్రమైన ధనహాని కలగవచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు అంతా కష్టకాలమే. వ్యాపారంలో వివాదాలు ఏర్పడి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగులకు పనిచేసే చోట ఘర్షణ వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంటారు. 


ఇక మంగళ గ్రహం కన్యా రాశిలో అస్తమించడంతో వృషభ రాశి జాతకులకు ఆరోగ్యం వికటిస్తుంది. ప్రయాణం సందర్బంగా నిర్లక్ష్యం ధనహానికి కారణమౌతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది. అనుకున్న పనులు జరగకపోవడంతో ఎప్పటికప్పుడు నిరాశ ఆవహిస్తుంటుంది. ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటారు. పనిచేసే చోట మీ పై అధికారులతో ఇబ్బందులు తలెత్తవచ్చు.


Also read: Dhana Rajayogam 2023: ధన రాజయోగం ప్రభావంతో ఆ 3 రాశులకు ఇవాళ్టి నుంచి పట్టిందల్లా బంగారమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook