Dhana Rajayogam 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం శని, బుధ గ్రహాల స్థితి అనేది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలిసి ధన రాజయోగం నిర్మించనున్నాయి. ఫలితంగా కొందరికి మహర్దశ పట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత, మహత్యముంటుంది. సెప్టెంబర్ 18 నుంచి బుధ, శని గ్రహాలు కలిసి ఏర్పర్చనున్న ధన రాజయోగంతో అన్ని రాశులపై ప్రభావం పడినా..3 రాశులపై మాత్రం విశేషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అదృష్టం తోడుగా ఉండటం వల్ల అంతులేని ధన సంపదలు లభిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా అనువైన సమయంగా భావించాలి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మిగిలిన ఏ సమస్యలు ఉత్పన్నం కావు.
శని, బుధ గ్రహాలు ఏర్పర్చనున్న ధన రాజయోగం ప్రభావం వృషభ రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా మారనుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీతం పెరగనుంది. ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకైతే ఊహించని లాభాలుంటాయి. పెద్ద పెద్ద డీల్స్ చేతికి అందుతాయి. ఆదాయం పెరగడంతో పాటు జీవితం కూడా సాఫీగా సాగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే చాలు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తుల రాశి జాతకులకు ఈ సమయం అత్యంత లాభదాయకం. శని, బుధ గ్రహాలు కలిసి ఏర్పర్చనున్న ధన రాజయోగంతో అన్ని విషయాల్లో విజయం లభిస్తుంది. మీ ఖజానాలో డబ్బు పెరుగుతుంది. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాల్ని అందిస్తాయి. వ్యాపారులకు సైతం చాలా అనువైన సమయం. వ్యాపారం విస్తృతమై లాభాలు ఆర్జిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బులకు కొదవ ఉండదు.
బుధ, శని గ్రహాల ధన రాజయోగం ప్రభావంతో మేష రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. విద్యార్ధులకు ఈ సమయం చాలా బాగుంటుంది. సంతానం విషయంలో ఆనందం కలుగుతుంది, సోదర, సోదరీమణుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి కావచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఎదురుకాదు. ఉద్యోగులకు పదోన్నతి, వ్యాపారులకు లాభాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook