Mars-Rahu Conjunction 2022: మేషరాశిలో రాహువు-కుజుడు కలయిక .. ఈ 4 రాశులవారు జాగ్రత్త..!
Rahu-Mangal Yuti 2022: ఇవాళ అంగారక గ్రహం మేష రాశిలోకి ప్రవేశించబోతోంది. ఇది అక్కడ అంగారక యోగాన్ని సృష్టిస్తుంది. దీని ప్రతికూల ప్రభావం 4 రాశులవారిపై ఉండనుంది.
Mars Rahu Conjunction in Aries 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంతో మారుస్తుంది. జూన్ 27న, అంగారక గ్రహ సంచారం (Mars Transit 2022) జరగబోతోంది. ఈ రోజు కుజుడు తన సొంత రాశిచక్రమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే ఆ రాశిలో రాహు ఉన్నాడు. మేషరాశిలో రాహువు-అంగారకుడి కలయిక వల్ల కుజ యోగం ఏర్పడుతుంది. అయితే దీని ప్రతికూల ప్రభావం ముఖ్యంగా 4 రాశులవారిపై ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండండి
మేషరాశిలో రాహువు-కుజుడు కలయిక వల్ల ఏర్పడిన అంగారక యోగం ఆగస్టు 10 వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్ట్ 10 వరకు ఈ రాశువారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
వృషభం (Taurus): రాహువు-కుజుడు కలయికతో ఏర్పడిన అంగారక యోగం వృషభ రాశి వారికి ధన నష్టం కలిగిస్తుంది. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అంతే కాకుండా తోబుట్టువులతో వివాదాలు రావచ్చు. మధురంగా మాట్లాడండి మరియు వివాదాలకు దూరంగా ఉండండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారులు ఎలాంటి పెద్ద ఒప్పందాలను కుదుర్చుకోవద్దు.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ కాలంలో అదృష్టం పెద్దగా కలిసిరాదు. దీని వల్ల చేసే పనులు కూడా ఆగిపోతాయి. ప్రయాణాలు రద్దు చేయబడవచ్చు. అయితే ఈ సమయంలో ప్రయాణం చేయకపోవడమే మంచిది. బయట ఆహారం తీసుకోవడం మానుకోండి, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.
మకరం(Capricorn): అంగారక యోగం మకర రాశి వారికి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ఓపికగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి రాహు-అంగారక కలయిక సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు మారవచ్చు. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుండి.
Also Read: Mars Transit Effect: మేషరాశిలో కుజుడు సంచారం... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.