Mangal Gochar 2022: వృషభరాశిలోకి కుజుడు.. రాబోయే 68 రోజులపాటు ఈ రాశులకు లాభం!
Mangal Gochar 2022: అంగారక సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఆగస్టు 10న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీని సంచారం వల్ల ఈ రాశులకు రెండు నెలలపాటు భారీగా లాభపడనున్నారు.
Mangal Gochar 2022: ఆగస్టు 10న కుజుడు వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022) ప్రవేశించాడు. సాధారణంగా కుజుడు ఒక రాశిలో గరిష్టంగా 45 రోజులు ఉంటాడు, అయితే ఈ సారి మాత్రం 68 రోజులపాటు ఉండనున్నాడు. అంటే అక్టోబరు 16 వరకు కుజుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీని సంచారం 7 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): కుజుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు ప్రయాణాలు చేస్తారు.
కర్కాటకం (cancer): ఈ రాశిలోని 11వ ఇంట్లో కుజుడు సంచరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఈ రాశివారికి ప్రమోషన్ వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు.
సింహం (Leo): సింహరాశి యెుక్క 10వ ఇంట్లో అంగారకుడు సంచరించడం వల్ల అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది.
కన్య (Virgo): ఈ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల వీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అమ్మ సపోర్టు లభిస్తుంది.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి యెుక్క 6వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. ఇది ఈ రాశివారికి మేలు చేస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.
మకరం (Capricorn): మకరరాశి యెుక్క 5వ ఇంట్లో కుజుడు సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.
మీనం (Pisces): మీన రాశిలోని 3వ ఇంట్లో కుజుడు సంచరించడం చాలా ప్రయోజనకరం. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా భారీగా లాభపడతారు.
Also Read; Sun Venus Conjunction 2022: మరో 6 రోజుల్లో ఈ రాశులవారి లైఫ్ డబ్బు మయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook