Mars transit 2023: మంగళ గ్రహాన్ని శుభ ప్రయోజనాలు చేకూర్చే గ్రహమని జ్యోతిష్య పండితులు చెబుతారు. అదే సమయంలో ఈ గ్రహం గోచారం ప్రభావం కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరిలో మాత్రం తీవ్ర సమస్యలకు కారణమౌతుంది. ఈసారి మంగళ గ్రహం గోచారం కారణంగా ఈ మూడు రాశులకు దాదాపు నెలన్నర రోజులు సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని సేనాపతిగా భావిస్తారు. మరోవైపు భూమి పుత్రుడిగా కూడా మంగళ గ్రహాన్ని పిలుస్తుంటారు. అలాంటి ఈ మంగళ గ్రహం నిన్న అంటే ఆగస్టు 18వ తేదీ సాయంత్రం కన్యా రాశిలో ప్రవేశించాడు. కన్యా రాశిలో మంగళ గ్రహం అక్టోబర్ 3 వరకూ ఉంటాడు. అంటే దాదాపు నెలన్నర రోజులు. సాధారణంగా మంగళ గ్రహం గోచారం అన్ని రాశులకు శుభవార్త అందిస్తుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని రాశుల జీవితాలను సమస్యల్లో నెట్టేస్తుంది. ఈసారి మంగళ గ్రహం గోచారం కారణంగా మూడు రాశులకు తీవ్ర సమస్యలు తప్పేట్టు లేవు. ఈ మూడు రాశులవారికి నెలన్నర రోజులు సమస్యలు తప్పవని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


వృషభ రాశి జాతకులకు మంగళ గ్రహం కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మీ కోపాన్ని నియంత్రించుకుని పరిస్థితుల్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. తీసుకున్న రుణాల చెల్లింపు కష్టమౌతుంది. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటాయి.


మంగళ గ్రహం కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల కుంభ రాశి జాతకులకు క్లిష్ట సమయంగా ఉంటుంది. అక్టోబర్ 3 వరకూ ఉద్యోగులకు, వ్యాపారులకు సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపారం కొనసాగించడమే కష్టమౌతుంది. ఎందుకంటే వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆఖరికి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య కూడా సంబంధాలు చెడిపోవచ్చు. అందుకే కష్టాలున్నప్పుడు సంయమనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్ధికంగా కష్టాలు తప్పవు.


కన్యా రాశిలో మంగళ గ్రహం గోచారం కారణంగా ఆగస్టు 18 అంటే నిన్నటి నుంచి సింహ రాశిపై దుష్ప్రభావం ప్రారంభమైంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాలు ఎదురుకావచ్చు. పొరుగువారితో వివాదాలు ఏర్పడే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసర విషయాల్లో కలగజేసుకోవడం మానేసి మీ పనులపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగం చేసేవాళ్లు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రతి దుష్ప్రభావం నుంచి కాపాడుకునే మార్గాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా గ్రహాల గోచారంతో జరిగే నష్టాల్నించి తప్పించుకోవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. మంగళ గ్రహం గోచారంతో ఎదురయ్యే దుష్ప్రభావాల్నించి తప్పించుకునేందుకు రోజూ మంగళ గ్రహం బీజమంత్రం ఓం అంగారకాయ నమహ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. దాంతోపాటు హనుమాన్ చాలీసా పఠించాలి. ప్రతి మంగళవారం ఆలయానికి వెళ్లి హనుమంతుడి దర్శించుకోవాలి. ఇలా చేయడం వల్ల గోచారం దుష్ప్రభావం క్రమంగా తగ్గవచ్చు.


Also read: Hariyali Teej 2023: హరియాలీ తీజ్‌ పండగ ప్రత్యేకత, పూజా సమయాలు, ఉపవాస వ్రతం పాటించడం వల్ల కలిగే లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook