Mangal Gochar 2022: ఈ 4 రాశుల వారు రాబోయే 3 నెలలుపాటు జాగ్రత్త!
Mangal Gochar 2022: ఆగస్టు 10న కుజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. అంగారకుడి యొక్క ఈ సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2022: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తనరాశిని మారుస్తుంది. రెండు రోజుల కిందట అంగారకుడు తన రాశిని మార్చాడు. మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022) ప్రవేశించాడు. ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 16 వరకు అంగారక గ్రహం వృషభ రాశిలోనే ఉండబోతోంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే కొన్ని రాశులవారిపై మాత్రం మూడు నెలలపాటు చెడు ప్రభావం చూపనుంది. ఈ అంగారక సంచారం ఎవరికి అశుభం కాబోతుందో తెలుసుకుందాం.
ఈ రాశులకు కష్టకాలం
మేషం (Aries)- అంగారక సంచారం ఈ రాశివారికి కలిసి రాదు. ఇతరులతో గొడవలు పెట్టుకుంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
మిథునం (Gemini) - మిథున రాశి వారికి సోదరుల సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు రావచ్చు.
తుల రాశి (Libra)- ఈ రాశివారి జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. మీ స్పీచ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి (Pisces)- ఈ రాశి వారు 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. దీని ప్రభావం ఆర్థిక పరిస్థితిపై కనిపిస్తుంది. మీ సోదరుడితో విభేదాలు రావచ్చు. తండ్రితో సంబంధాలు చెడిపోవచ్చు.
Also Read: వృషభ రాశిలో కుజుడు సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపనుంది, పరిహారాలు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook