Mangal Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశిలో మార్పు చాలా ముఖ్యమైనది. గ్రహాల రాశి మార్పు ప్రభావం ప్రతి ఒక్కరిపై ఎంతో కొంత ఉంటుంది. ఇది కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈ నెల 16న కుజుడు తన రాశిని మార్చి.. మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. మిథునరాశిలో అంగారక సంచారం (Mars Transit 2022) కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం(Cancer): కుజ సంచారం వల్ల ఈ రాశివారు పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఎక్కడైనా చిక్కుకుపోయిన లేదా అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు ఎక్కడ పని ఉంటే అక్కడ అధికారుల సహకారం లభిస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది.
కన్య(Virgo): వ్యాపారులకు కుజుడు రాశిలో మార్పు శుభప్రదం కానుంది. మీరు బిజినెస్ ను విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
తులారాశి (Libra): అక్టోబరులో అంగారకుడి సంచారంతో తుల రాశి వారికి కూడా అదృష్టం వరిస్తుంది. భారీగా డబ్బు అందుతుంది. పొదుపు కూడా పెరుగుతుంది. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సపోర్టు దక్కుతుంది. వ్యాపారులు భారీగా లాభాలు గడిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


వృశ్చిక రాశి (Scorpio): కుజుడు రాశిలో మార్పుతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు జాబ్ మారే అవకాశం ఉంది. తల్లిదండ్రులు సపోర్టు ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మీరు ఉద్యోగంలో సహచరుల నుండి సపోర్టు పొందుతారు. ట్రాన్సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
కుంభ రాశి (Aquarius): అంగారక సంచారం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో కోపం తెచ్చుకోకండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

 


Also Read: Shani Dev: శనివారం ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే... ఇక మీపై డబ్బు వర్షమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook