Rakhi Festival 2022: రాఖీ పండుగ నుండి 5 రాశులవారికి గోల్డెన్ డేస్!
Raksha Bandhan 2022 Date: ఇవాళే రక్షాబంధన్. కొంత మంది రేపు కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. నిన్న కుజుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇది 5 రాశులవారికి అపారమైన ప్రయోజనాలు అందించనుంది.
Mangal Gochar before Raksha Bandhan 2022: రాఖీ పండుగ 5 రాశులవారి జీవితాల్లో వెలుగులు తేనుంది. అక్టోబరు 14 వరకు వీరికి గోల్డెన్ డేస్ అనే చెప్పాలి. ఎందుకంటే రక్షాబంధన్ కు ఒక రోజు ముందుగానే కుజుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి (Mars Transit in Taurus 2022) ప్రవేశించాడు. ఈ అంగారకుడి సంచారం 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అక్టోబరు వరకు వీరు భారీగా డబ్బు సంపాదిస్తారు.
ఈ రాశుల వారికి రక్షాబంధన్ శుభప్రదం
వృషభం (Taurus): కుజుడు సంచారం వృషభ రాశిలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇది ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు శత్రువులపై విజయం ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. వివాహం జరిగే అవకాశం ఉంది.
సింహం (Leo): అంగారక సంచారం సింహ రాశి వారికి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. దీంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటకం (Cancer): కుజ సంచారం వారి జీవితంలో అనూహ్య మార్పులు తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. రెండు చేతుల డబ్బులు సంపాదిస్తారు.
తుల (Libra): అంగారక గ్రహ సంచారం తుల రాశి వారికి లాభిస్తుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. జీవితంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. న్యాయ వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభం (Auarius): కుజుడు రాశి మార్పు వల్ల ఈ రాశివారు లవ్ లైప్ బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Rakhi: సోదరుడి కంటే ముందు ఈ దేవుళ్లకు రాఖీ కట్టండి... మీ కోరికలు నెరవేర్చుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook