Raksha Bandhan 2022: సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను భావిస్తారు. ఈ రోజున అక్కా-చెల్లెల్లు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి... అతని దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రాఖీ పండుగను (Rakshabandhan 2022) ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగను రేపు అంటే 11 ఆగస్టు 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున సోదరుడి కంటే ముందు దేవుడికి రాఖీ కట్టడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముందుగా ఏ దేవుడికి రాఖీ కట్టడం శ్రేయస్కరమో తెలుసుకుందాం.
వినాయకుడు
హిందూ మతంలో ఏ పూజలోనైనా లేదా ఏ కార్యక్రమంలో నైనా ముందుగా పూజించేది గణపతినే. వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. రాఖీ పండుగ రోజున గణేశుడికి రాఖీ కట్టడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది.
శివుడు
శ్రావణ మాసం శివునికి ఎంతో ఇష్టమైనది. ఈ మాసం చివరి రోజున రక్షాబంధన్ పండుగ వస్తుంది. ఈ రోజున శివుడికి రాఖీ కట్టడం వల్ల మీరు మీ బాధల నుండి విముక్తి పొందుతారు.
ఆంజనేయుడు
రాఖీ పండుగ రోజున హనుమంతుడు ఎరుపు రంగు రాఖీని కట్టాలి. దీంతో మీ జాతకంలో అంగారకుడి ప్రభావం తగ్గిపోయి బలం, తెలివితేటలు పెరుగుతాయని నమ్ముతారు.
శ్రీ కృష్ణుడు
శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా భావించి రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ద్రౌపది వస్త్రపహరణం జరిగినప్పుడు ఆమెను శ్రీకృష్ణుడు రక్షించాడు. ఈ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ కట్టడం ద్వారా అతను మిమ్మల్ని ప్రతి పరిస్థితిలో రక్షిస్తాడు.
Also Read: Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18 లేదా 19? క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook