Mars Transit May 2023: ఆస్ట్రాలజీలో కుజుడిని మార్స్, మంగళదేవుడు, రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహం అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. గ్రహాల కమాండరైన అంగారకుడి స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా కుజుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.  ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్న మార్స్.. మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ సంచారం వల్ల 6 రాశులవారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
అంగారక సంచారం వల్ల మేషరాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త బండి కొనాలన్నా మీ కోరిక నెరవేరుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు కూడా దక్కుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. కెరీర్ సూపర్ గా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోండి. 
సింహరాశి 
కుజుడి రాశి మార్పు సింహరాశి వారికి ప్రయోజనకరం. దీని కారణంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విదేశాల్లో చదవాలనే మీ కోరిక నెరవేరుతుంంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పని లేదా వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. 
కన్య రాశి
అంగారక గ్రహ సంచారం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ లవ్ లైఫ్ బాగుంటుంది. 
తులారాశి
కుజుడు సంచారం కారణంగా మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీరు ఆఫీసులో పెద్ద బాధ్యతను తీసుకుంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. క్రీడాకారులకు ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Guru Pushya Yoga 2023: గురు పుష్య యోగం రోజున బంగారం కొనడం చాలా మంచిది.. కారణం తెలుసుకోండి?


ధనుస్సు రాశి
మార్స్ మీ రాశి యెుక్క ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి రావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. 
కుంభ రాశి
అంగారకుడి రాశి మార్పు కారణంగా వీరి పనికి ప్రశంసలు దక్కుతాయి. కుంభరాశి వారికి ప్రమోషన్ తోపాటు కొత్త బాధ్యత పొందవ్చు. ఆదాయం వనరులు పెరుగుతాయి. మీ పట్ల కొందరికి అసూయ కలుగుతుంది. 


Also Read: Shani Retrograde 2023: కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్న శని.. ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook