Mars Transit in Cancer 2023: జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. జాతకంలో కుజుడు శుభప్రదంగా ఉంటే వారు అపారమైన సంపదను పొందుతారు. అంతేకాకుండా వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మరోవైపు కుండలిలో కుజుడు బలహీన స్థితిలో ఉంటే వారు కోపాన్ని, అహంకారాన్ని కలిగి ఉంటారు. మరో రెండు రోజుల్లో అంటే మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూలై 01 వరకు అతడు అదే రాశిలో ఉంటాడు. దీంతో నాలుగు రాశులవారు తిరుగులేని ప్రయోజనాలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: అంగారక సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
కన్య: అంగారకుడు రాశి మార్పు కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభం కలుగుతుంది. 
కుంభం: కుంభ రాశి వారికి అంగారక సంచారం విపరీతమైన ఆదాయాన్ని ఇస్తుంది.  మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సముకూరుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ లక్ష్యం నెరవేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
మీనం: మార్స్ సంచారం మీనరాశి వారి జీవితంలో ప్రేమను నింపుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


Also Read: Mercury Transit 2023: ఈ 3 రాశులకు మరో 38 రోజుల వరకూ ఊహించని డబ్బు,, అంతా అదృష్టమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook