Mangal Gochar 2024 Effect:  సాధారణంగా గ్రహాల కదలిక ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇది కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. పంచాంగం ప్రకారం, 15 నెలల తర్వాత కుజుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇదే సమయంలో శని అదే రాశిలో ఉంటాడు. దీంతో కుంభరాశిలో శని, కుజుల కలయిక సంభవించబోతుంది. వీరిద్దరి కలయిక మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
ఈ రాశి యెుక్క లగ్న గృహంలో అంగారకుడు సంచరించబోతున్నాడు. అంతేకాకుండా ఇదే రాశిలో శని, కుజుడుల కలయిక జరగబోతుంది. దీని కారణంగా మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు జీతం కూడా పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. 
మేషరాశి
కుంభరాశిలో కుజుడు సంచారం మేషరాశి వారికి మేలు చేస్తుంది.  మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ వద్దకు చేరుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీకు వస్తుంది. పిల్లలు లేనివారికి సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. 


Also Read: Astology-Rahu-Shukra: 12 యేళ్ల తర్వాత అరుదైన గ్రహ కలయిక.. ఈ రాశుల వారికీ వివాహా, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం..


వృషభం
వృషభరాశికి చెందిన కర్మ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో వ్యాపారులు భారీగా లాభాలను పొందనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జాబ్ చేసేవారి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


Also Read: Chanakya Niti: మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా.. ? ఐతే.. వెంటనే ఈ రెండు పనులు అలవాటు చేసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook