Mars Transit 2023 Effect: ఆస్ట్రాలజీలో అంగారకుడిని ధైర్యం, భూమి మరియు సంపదకు కారకుడిగా భావిస్తారు. జూలై 07న కుజుడు సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం ప్రజలందరిపై జీవితాలపై పెను ప్రభావం చూపనుంది. సింహరాశిలోకి అంగారక సంచారం కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
అంగారకుడి సంచారం వృషభ రాశివారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. మీ జాతకంలో నాల్గో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. పైగా ఈ రాశి యెుక్క 7వ మరియు 12వ ఇళ్లకు మార్స్ అధిపతి. మీరు ఈ సమయంలో నచ్చిన వాహనంతోపాటు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
సింహరాశి 
సూర్యుని రాశి అయిన సింహరాశిలో కుజుడు సంచరించబోతున్నాడు. ఈ రాశి యెుక్క నాల్గవ మరియు తొమ్మిదవ ఇంటికి అంగారకుడిని అధిపతిగా భావిస్తారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 


Also Read: Shani Vakri 2023: రివర్స్‌లో కదలనున్న శని-రాహు-కేతువు.. రాబోయే 6 నెలలపాటు ఈ 4 రాశులకు కష్టాలే కష్టాలు..


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో కుజుడు ప్రయాణించబోతున్నాడు. దీంతో మీకు అదృష్టం కలిసి రానుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ పనులకు ప్రశంసలు దక్కుతాయి. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.  
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి అంగారక గ్రహ సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఆఫీసులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారు లాభపడతారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shash Rajyog benefits: మరో ఆరు రోజుల్లో 'శష్ రాజయోగం'.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook