Masik Shivratri 2022: సనాతన ధర్మంలో ప్రతి నెలలో ఒక్కో మాస శివరాత్రి జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఇది ప్రతి నెలలో కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో డిసెంబర్‌ చివరి నెల కావడంతో ఈ మాసంలో వచ్చే శివరాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే ఈ రోజుకు ఎందుకు ఇంత ప్రత్యేక ఉందంటే.. ఇదే రోజు శివుడు, పార్వతిని పూజిస్తారు. దీని వల్ల శివుడికి మోక్షం లభిస్తుంది. అయితే ఈ రోజు భక్తులంతా శివున్ని పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా  జీవితంలోని అన్ని కష్టాలు కూడా దూరమవుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నెల మాస శివరాత్రి డిసెంబర్ 21న జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దోషం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతినెలా శివరాత్రి రోజున నల్ల నువ్వులతో చేసిన ఆహారాలను శివునికి నైవేద్యంగా పెడితే.. జాతకంలో శని దోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఉద్యోగం, వ్యాపారం
మాస శివరాత్రి రోజున శంకరునికి ఒక పిడికెడు బియ్యంతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది.  అంతేకాకుండా వ్యాపార రంగంలో ఆర్థిక సమస్యలన్ని తగ్గిపోయి. అధిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ శివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు మేత తినిపించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


వివాహాలు:
మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శంకరునికి  పూజా కార్యక్రమాలు చేసి 5 కొబ్బరి కాయాలు కొడితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉపవాసాలు పాటించి 'ఓం శ్రీ వర ప్రదయ్ శ్రీ నమః' అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వివాహానికి అడ్డంకి సమస్యలుంటే సులభంగా తీరుతాయి. దీంతో అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా  


Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook