Masik Shivratri 2023: మాస శివరాత్రి శుభ సమయం, పూజా పద్ధతి, వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు!
Masik Shivratri 2023: మాస శివరాత్రి రోజు శివునికి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ వ్రతాన్ని చేసే క్రమంలో తప్పకుండా భక్త శ్రద్ధలో ఉండాల్సి ఉంటుంది. ఏ సమయంలో పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Masik Shivratri 2023: మాస శివరాత్రి హిందూ పురాణాల్లో మంచి ప్రాముఖ్య ఉంది. ప్రతి సంవత్సరం కృష్ణ పక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మే 17న (ఈ రోజు) త్రయోదశి కావడం వల్ల ఈ రోజు మాస శివరాత్రి వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శివపార్వతులు అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ రోజున శివ పూజ చేసి ప్రదోష వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల కోరకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా అవివాహితులు ఈ రోజు వ్రతాన్ని చేయడం వల్ల మంచి భాగస్వామి లభిస్తుందని నిపుణులు నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాస శివరాత్రి ఉపవాస తేదీ, పూజ ముహూర్తాన్ని తెలుసుకుందాం..
శుభ సమయం:
జ్యేష్ఠ, కృష్ణ పక్ష చతుర్దశి
17 మే 2023 బుధవారం
మాస శివరాత్రి ప్రారంభ సమయం: మే 17 రాత్రి 10:28 గంటలకు..
మాస శివరాత్రి ముగింపు సమయం: మే 17 రాత్రి 10:28 గంటలకు..
పూజా పద్ధతి:
➜ మాస శివరాత్రి రోజున తప్పకుండా తల స్నానం ఆచరించాల్సి ఉంటుంది.
➜ పట్టు వస్త్రాలను ధరించి శివపార్వతులను పూజించాలి.
➜ శివుడి ముందు దీపం పెట్టి వెలిగించాలి.
➜ అంతేకాకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలు, గంగాజలంతో అభిషేకం చేయాలి.
➜ శివలింగానికి బిల్వపత్రాలు కూడా సమర్పించాలి.
➜ పూజ చేసేటప్పుడు నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి.
పూజ వల్ల కలిగే ప్రయోజనాలు:
శివుడికి ఇష్టమైన రోజు మాస శివరాత్రి కాబట్టి ఈ రోజు శివలింగానికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా శివలింగానికి రుద్రాభిషేకం చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి