Hyderabad Fire Accident: హైదరాబాద్  పురానాపూల్‌లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు సమచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో గోదాం పైకప్పు కూలింది. ఈ గోదాంలో ఫ్లాస్టిక్, కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే పరిసర ప్రాంత ప్రజలను ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించారు. పైకప్పు కూలడంతో మంటలను కంట్రోల్ చేయడం కష్టంగా మారింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  అయితే ముందు జాగ్రత్త చర్యగా ఘటనాస్థలిలో మూడు అంబులెన్స్ లు రెడీగా ఉంచున్నట్లు తెలుస్తోంది. గోడౌన్ లో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలియరావల్సి ఉంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది.


తాజా ఘటనతో రాష్ట్రంలో నిబంధనలు పాటించని గోదాంలు, భవనాలపై  చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపుందుకుంది. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెున్న సికింద్రాబాద్ ఘటన.. నేడు ఈ ప్రమాదం జరగడంతో తెలంగాణ అగ్నిమాపక విపత్తు నివారణశాఖ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 


Also Read: Godavari Express Derailed: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్, తప్పిన పెను ప్రమాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook