Godavari Express Derailed: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్, తప్పిన పెను ప్రమాదం

Godavari Express Derailed: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2023, 08:20 AM IST
Godavari Express Derailed: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్, తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రైలులోని నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది.

విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ సమీపంంలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్‌సి నగర్ సమీపంలో గోదావరి రైలు పట్టాలు తప్పింది. ఏకంగా 4 భోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం, అప్రమత్తమైన లోకో పైలట్ ట్లైన్ నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. 

రైలులోని నాలుగు భోగీలు పట్టాల తప్పగానే రైళ్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక్కసారిగా రైళ్లో కుదుపులు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. రైలు బ్రేక్ వేయగానే ప్రయాణీకులంతా ఒక్కసారిగా రైళ్లోంచి కిందకు దిగిపోయారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్ఠవశాత్తూ ఎవరికీ ఏం కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. 

ప్రధాన మార్గంలో గోదావరి రైలు పట్టాలు తప్పడంతో అదే మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగి ఆలస్యమయ్యాయి. ప్రయాణీకుల్ని ఘట్‌కేసర్ నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఇతర రైళ్లను బీబీనగర్, భువనగిరి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. 

Also read: AP New Capital: ఏపీకు విశాఖే రాజధాని, ప్రభుత్వ వైఖరి మారిందా, మంత్రి బుగ్గన మాటల వెనుక అర్ధమిదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News