Mauni Amavasya 21 january 2023 Horoscope: ఈ రోజు కొన్ని రాశులు వారికి అద్భుతంగా ఉండనుంది. ఇవాళ అంటే జనవరి 21న మౌని అమావాస్య (Mauni Amavasya 2023). అంతేకాకుండా ఈ రోజు అరుదైన యాదృచ్చికం ఏర్పడతుంది. ఇప్పటికే శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ అరుదైన కలయిక వల్ల ఏ రాశులవారు అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): ఈరోజు మీ మానసిక స్థితి బాగుంటుంది. హ్యాపీనెస్ పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. లవ్ లైవ్ అద్భుతంగా ఉంటుంది. వ్యసనాలు దూరమవుతాయి. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. 
వృషభం (Taurus): ఖర్చులు తగ్గుముఖం పట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆఫీసుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. 
సింహం (Leo): ఈరోజు ప్రయాణం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం నుండి పూర్తి సహకారం మరియు మద్దతు ఉంటుంది. ఆఫీసులో సహచరుల అండతో మీ పనితీరు మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. 


కన్య (Virgo): ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. పనితీరు పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
ధనుస్సు (Sagittarius): ఈరోజు మీరు మీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తారు. కెరీర్‌లో పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మీ మాట వింటారు.  ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.


Also Read: Shani Amavasya: ఈ శని అమావాస్య నాడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు.. ఫుల్ డీటేల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook