Mercury venus conjunction: బుధ, శుక్ర గ్రహాల కలయిక ప్రభావం..ఆ మూడు రాశులపై అమితం
Mercury venus conjunction: జూన్ నెలలో బుధ, శుక్ర గ్రహాలు వృషభరాశిలో ప్రవేశించనున్నాయి. శుక్రుడి రాశి వృషభంలో ఈ రెండు గ్రహాల ప్రవేశం మహాలక్ష్మీయోగం కల్గించనుంది. ఆ మూడు రాశులవారికి శుభసూచకం.
Mercury venus conjunction: జూన్ నెలలో బుధ, శుక్ర గ్రహాలు వృషభరాశిలో ప్రవేశించనున్నాయి. శుక్రుడి రాశి వృషభంలో ఈ రెండు గ్రహాల ప్రవేశం మహాలక్ష్మీయోగం కల్గించనుంది. ఆ మూడు రాశులవారికి శుభసూచకం.
జూన్ 3 నుంచి బుధగ్రహం వృషభరాశిలో ప్రవేశించనుంది. ఇది మిగిలిన రాశులపై ప్రభావం చూపించనుంది. అటు జూన్ 18వ తేదీన శుక్ర గ్రహం కూడా వృషభరాశిలో ప్రవేశించనుంది. శుక్రుడి రాశి వృషభంలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించడం మహాలక్ష్మీయోగం ప్రాప్తింపచేయనుంది. గ్రహాల ప్రవేశం కారణంగా...ఈ అద్భుతమైన మేలు కలయిక ప్రభావం ఇతర రాశులపై కూడా పడనుంది. ఈ ప్రభావం జీవితంలోని పలు దశలపై పడనుంది. ధనం, బుద్ది, వ్యాపారానికి కారకమైన బుధ గ్రహమైతే..ధన వైభవాలు, భౌతిక సుఖం, రోమాన్స్‌లకు శుక్రగ్రహం కారకం. ఈ రెండు గ్రహాల ప్రవేశం ఇతర రాశులపై పడనుంది.
మేషరాశి జాతకులకు బుధ, శుక్ర గ్రహాల ప్రవేశం కారణంగా మహాలక్ష్మీయోగం ప్రాప్తిస్తుంది. ఈ రాశివారికి ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుంది. ఆర్ధిక లాభాలుంటాయి. ఒకేసారి ధనం వచ్చి పడుతుంది. వ్యాపారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సమయం ఎటు చూసినా మంచిదే.
సింహరాశివారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్స్ లభించవచ్చు. ధనలాభం కలుగుతుంది. పెండింగులో పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు లాభం పెరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
కర్కాటకరాశివారికి ఈ సమయం చాలా మంచిది. వృద్ధి లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలుగుతాయి. బుధ శుక్ర గ్రహాల ప్రవేశంతో కలిగే మహాలక్ష్మీ యోగం పనుల్లో సాఫల్యం కల్గిస్తుంది. మీరు ఇప్పటివరకూ చేసిన పనుల ప్రయోజనం లభించడం ప్రారంభమౌతుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. యాత్రలు లాభదాయకంగా ఉంటాయి.
Also read: Weekly Horoscope: ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook