Weekly Horoscope: ఈ వారం మీ జాతకం ఎలా ఉందో పరిశీలిద్దాం. జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న జాతకం ఎవరికి ప్రయోజనం, మరెవరికి కష్టంగా ఉండనుంది. కొంతమందికి మాత్రం అధిక లాభాల్ని చేకూర్చనుంది.
ఈ వారం చాలా మందికి గుడ్‌న్యూస్ అందించనుంది. మరి కొంతమందికి అప్రమత్తం చేయనుంది సింహరాశివారు ఉన్నత స్థానాన్ని పొందేందుకు టీమ్ లేదా బాస్‌తో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అటు ధనస్సురాశివారికి అధికారిక స్థితి బాగుంటుంది.
మేషరాశివారికి ఈ వారం పనులు పూర్తయ్యేందుకు కాస్త ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద లావాదేవీలు జరిగే అవకాశాలున్నాయి. కుటుంబ సమస్యలు దూరమయ్యేందుకు కుటుంబసభ్యులతో కూర్చుని చర్చించుకోవాలి. ఆరోగ్యపరమంగా ఇబ్బందులు ఎదురౌతాయి.
వృషభరాశివారికి జూన్ 9 నుంచి మంచి ఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవల్సి వస్తుంది. మందుల వ్యాపారంలో పెట్టుబడి సమస్యలెదురవుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురౌతాయి. విశ్వాసమే ప్రాతిపదికగా ముందుకు నడవాలి.
మిధునరాశివారికి కెరీర్ పరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారంలో ప్రగతి కన్పిస్తుంది గుండె సంబంధిత సమస్యలపై నిర్లక్ష్యం మంచిది కాదు. సామాజికంగా యాక్టివ్‌గా ఉండాలి. మీ సంబంధాల్ని కూడా యాక్టివ్‌గా ఉంచుకోవాలి.
కర్కాటకరాశి వారికి ఈ వారం క్రియేటివిటీ పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బిజీగా ఉండేందుకు ప్రయత్నించండి. లేకపోతే సమస్యలెదురవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలపై అప్రమత్తత అవసరం.
సింహరాశివారు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు టీమ్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఆటోమొబైల్ వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. పాత రోగాలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది.
కన్యారాశివారు తాము పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల దృష్టి మీపై ఉంటుంది.
టెలీకమ్యూనికేషన్ వ్యాపారంలో నిరాశే ఎదురుకానుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలుంటాయి. అందరూ ఆనందంగా ఉంటారు. అవసరమైనవారికి సహాయం చేయాలి. ఆరోగ్యపరంగా స్వల్ప సమస్యలుంటాయి.
తులరాశివారికి ఈ వారం బాగుంటుంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు టీమ్ సహకారం అవసరం. వ్యాపార వ్యవహారాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో రుణాలు తీసుకోవచ్చు. కుటుంబసభ్యుల సహకారంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తీవ్ర గాయాలు కావచ్చు
ధనస్సురాశివారికి బాధ్యతల బరువు, ఆలస్యం కారణంగా పనులు సజావుగా సాగవు. వంశపారంపర్య వ్యాపారంలో వివాదాలు రావచ్చు. ఇంట్లో వివాహ శుభకార్యం జరగవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అధికారికంగా పరిస్థితి బాగుంటుంది.
కుంభరాశివారికి ఈ వారం పెండింగు పనులు పూర్తి చేసుకోవల్సి వస్తుంది. లేకపోతే మీ బాస్ నుంచి ఆగ్రహం ఎదుర్కోవల్సి వస్తుంది. ఇనుము సంబంధిత వ్యాపారం బాగుంటుంది. లాభాలు ఆర్జిస్తారు. మీ వాహనం దుర్ఘటనకు గురయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడవచ్చు.
మీనరాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యుులు లభిస్తారు కానీ కొత్త పెట్టుబడులు చేయవద్దు. కుటుంబసభ్యులతో వివాదాలతో దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా సమస్యలు వెంటాడుతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది.
Also read: Palmistry: మీ చేతి రేఖలపై ఆ వృత్తం ఉందా..అయితే అంతులేని సంపదే మీకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook