Budh Mahadasha: బుధ మహాదశ ప్రభావం వల్ల కలిగే అద్భుత ఫలితాలేంటో తెలుసా?
Budh Mahadasha: వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. బుధుడు సంపద, తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. బుధుడి మహాదశ మీపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో తెలుసుకుందాం.
Budh ki Mahadasha Effects: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు 25 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. మేధస్సు, సంపద, వ్యాపారం, కమ్యూనికేషన్ మరియు తార్కిక శక్తిని ఇచ్చేవాడు బుధుడు. ఎవరి జాతకంలో మెర్క్యూరీ శుభస్థానంలో ఉంటాడో వారికి తెలివితేటలకు కొదవ ఉండదు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. మీపై బుధ మహాదశ కొనసాగుతుంటే వారికి దేనికీ లోటు ఉండదు.
బుధ మహాదశ ప్రభావం
జ్యోతిషశాస్త్రంలో బుధుడి మహాదశను శుభప్రదంగా భావిస్తారు. ఏ వ్యక్తికైనా బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది. వీరు సరదాగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా సమాజంలో మీ పాపులారిటీ పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి పొందుతారు. ఆగిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి.
మరోవైపు, జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే వారికి బుధ మహాదశ ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. వీరి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు మీ డ్రీమ్ ను నెరవేర్చుకోలేరు. బిజినెస్ దెబ్బతింటుంది. ఉద్యోగులకు ఈ సమయం అంతగా కలిసి రాదు. మీ పనుల్లో ఆడ్డంకులు ఎదురవుతాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
బుధ మహాదశ నివారణలు
జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధ మహాదశలో మీరు అనేక రకాల సమస్యలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మెర్క్యురీకి సంబంధించిన పరిహారాలు చేయాలి.
** ప్రతి బుధవారం ఆవుకు మేత తినిపించండి. బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను కూడా దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
** జ్యోతిష్కుడికి మీ జాతకాన్ని చూపించి.. వారి సలహా తీసుకోండి. మీరు ఈ సమయంలో పచ్చ రాయిని ధరించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది.
** ఆహారంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా తినడం మంచిది. అంతేకాకుండా గ్రీన్ డ్రెస్ ధరించండి.
** బుధ గ్రహం యొక్క మంత్రాలను జపించడం వల్ల మీకు లాభం చేకూరుతుంది.
Also Read: Grah Gochar 2023: మార్చి నెలలో గ్రహాల గమనంలో పెను మార్పు... ఈ 5 రాశులవారు జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.