Vipreet Rajyog effect: గ్రహాల గమనంలో మార్పు కారణంగా శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. రీసెంట్ గా బుధుడు కుంభరాశిలో సంచరించాడు. దీని కారణంగా వ్యతిరేక రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వల్ల నాలుగు రాశుల వారి దశ తిరగనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విపరీత రాజయోగం ఈ రాశులకు వరం
మేష రాశిచక్రం
ఈ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మీ 3వ మరియు 6వ గృహాలకు అధిపతి మరియు మంచి స్థానంలో ఉన్నాడు. సూర్యుడు మరియు శని కూడా కలిసి కూర్చున్నారు. దీని కారణంగా మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. . ఈ సమయంలో మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు మీకు కలిసి వస్తాయి. 
కర్కాటక రాశిచక్రం
విపరీత రాజయోగం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి ధనయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు బుధుడు 12వ ఇంటికి, 3వ ఇంటికి అధిపతి. మీరు వ్యాపారంలో భారీగా లాభం పొందుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. డబ్బు ఆదా చేస్తారు. 
కన్య రాశిచక్రం
విపరీత రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు శని మరియు సూర్యునితో కలిసి ఆరవ ఇంట్లో కూర్చున్నాడు మరియు కేతువు మిమ్మల్ని చూస్తున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
ధనుస్సు రాశిచక్రం
వ్యతిరేక రాజయోగం ఏర్పడటం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ మూడవ ఇంట్లో బుధుడు కూర్చున్నాడు. అందుకే నిరుద్యోగులు ఈ సమయంలో కొత్త ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ ఉండవచ్చు. బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకుంటారు. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం దెబ్బతినే  అవకాశం ఉంది. 


Also read: Shukra And Rahu Yuti: హోలీ తర్వాత రాహువు-శుక్రుడి కలయిక... ఈ 3 రాశులవారు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.