Mercury Vakri 2023: కొత్త ఏడాదిలో తిరోగమనంలో బుధుడు.. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..
Mercury Vakri 2023: నూతన సంవత్సరంలో గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Budh Planet Vakri 2023: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. మేధస్సు, వ్యాపారం మరియు తార్కిక శక్తికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. బుధ గ్రహ గమనంలో మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఏప్రిల్ 21న మేషరాశిలో మెర్క్యురీ గ్రహం తిరోగమనం (Mercury Vakri 2023) చేయబోతున్నాడు. మేషరాశిని అంగారక గ్రహం పాలిస్తుంది. కుజుడి యెుక్క రాశిలో బుధుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
కర్కాటకం (Cancer): బుధ గ్రహం తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారు అపారమైన ధనాన్ని పొందుతారు. ఎందుకంటే బుధ గ్రహం మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో తిరోగమనం చేయబోతున్నారు. దీంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది.
సింహ రాశి (Leo): మెర్క్యురీ తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో తిరోగమనం చేయబోతున్నారు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి వచ్చే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది.
మీన రాశిచక్రం (Pisces): మెర్క్యురీ యొక్క తిరోగమనం మీకు భారీగా డబ్బు వస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో బుధ గ్రహం తిరోగమనం చేయబోతోంది. విద్య, బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగం మరియు మీడియాతో అనుబంధం ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
Also read: Sankranti Festival: 2023లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.