Mercury Transit 2022: ఇవాళ్టి నుంచి ఆ నాలుగు రాశులవారి కెరీర్, వ్యాపారం అన్నింటా అభివృద్ధి
Mercury Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. నవంబర్ 14 అంటే ఇవాళ బుధుడు వృళ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఈ రాశులకు శుభంగా మారనుంది.
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల రాశి పరివర్తనం వివిధ రాశుల జాతకాలపై ప్రభావం చూపించనుంది. ఇప్పుడు వృశ్చికరాశిలో బుధుడి ప్రవేశం కారణంగా ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం..
గ్రహాల రాజకుమారుడైన బుధ గ్రహం..బుద్ధి, ధనం, వ్యాపారం, సంవాదానికి కారకుడు. చాలా తక్కువ సమయంలో బుధ గోచారం జరుగుతుంటుంది. ప్రతి రాశిలో బుధుడి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. ఇవాళ నవంబర్ 14 న బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం 4 రాశులపై పడనుంది.
బుధుడి రాశి పరివర్తనం ప్రభావం
కర్కాటక రాశిపై బుధుడి వృశ్చిక రాశి ప్రవేశం ప్రభావం శుభసూచకంగా ఉంటుంది. కెరీర్‌లో అభివృద్ధి లభిస్తుంది. పదోన్నతి, ఆదాయం పెంపు ఉంటుంది. వ్యాపారంలో ధనలాభం జరుగుతుంది. శుభ వార్తలు వింటారు.
కన్యా రాశిపై బుధుడి రాశి పరివర్తనం ప్రభావం చాలా బాగుంటుంది. ఉత్సాహాన్ని, పరాక్రమాన్ని పెంచుతుంది. పనుల్లో విజయం లభిస్తుంది. విదేశీయాత్ర చేపడతారు. వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తుంది.
వృశ్చికరాశిపై బుధుడి గోచారం అన్నింటికంటే ఎక్కువగా, లాభదాయకంగా ఉంటుంది. కారణం బుధుడి ప్రవేశించేది ఈ రాశిలోనే. ఈ రాశి జాతకులకు వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
మీనరాశిపై బుధుడి గోచారం ప్రభావం అదృష్టాన్ని పెంచేదిగా ఉంటుంది. ఈ జాతకులకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. విధి సహాయంతో అన్ని పనులు సజావుగా సాగుతాయి. కెరీర్‌లో లాభాలుంటాయి. వ్యాపారం ఊహించినదానికంటే అధికంగా ఉంటుంది.
Also read: Venus Transit 2022: వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం... ఈరాశులవారి జీవితం కష్టాలమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook