జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహం గోచారం ఈ ఏడాది అంటే 2022లో రెండుసార్లు గోచారం చేయనుంది. 2023 ప్రారంభంలో బుధుడి వక్రమార్గం ఉంటుంది. బుధ గోచారం కారణంగా..3 రాశులవారికి లెక్కలేని ప్రయోజనాలు కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు, రాశుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. గ్రహాల గోచారం, వివిధ రాశుల్లో ప్రవేశం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. జనవరి 13వ తేదీన బుధుడు వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా చాలామందికి లాభం చేకూరనుంది. బుధుడు నేరుగా ప్రవేశించడం వల్ల 3 రాశుల జాతకాలపై ధనలాభం, కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. బుధగ్రహం వక్రమార్గం కారణంగా 3 రాశులపై అధిక ప్రభావం ఉంటుంది.


బుధ గోచారంతో ప్రయోజనాలు


వృశ్చిక రాశి


బుధ గ్రహం గోచారం ప్రభావం వృశ్చికరాశి జాతకులకు శుభంగా ఉంటుంది. ధనలాభం స్పష్టంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ డీల్స్ చేతికి చిక్కవచ్చు. ఆకస్మిక లాభముంటుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. మార్కెటింగ్, మీడియా వ్యక్తులకు లాభముంటుంది. విదేశీ యాత్ర చేయవచ్చు.


కుంభరాశి


బుధగ్రహం గోచారం కారణంగా కుంభరాశి జాతకులకు అపారమైన లాభాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కలుగుతాయి. కెరీర్‌లో ఏదైనా పెద్ద అవకాశం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులు లాభించవచ్చు. వ్యాపారంలో ప్రయోజనం కలుగుతుంది. 


మీనరాశి


బుధ గోచారంలో మార్పు కారణంగా మీనరాశివారి కెరీర్, డబ్బు విషయంలో అంతులేని లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగం చేసేవారికి వృద్ధి లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. వ్యాపారం చేసేవారికి లాభిస్తుంది. వ్యాపారం కలిసొస్తుంది.


Also read: Budh Margi 2023: ధనుస్సు రాశిలో నడవనున్న బుధుడు.. ఈ 3 రాశులవారికి దశ తిరగడం ఖాయం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook