Mercury transit: కేవలం 13 రోజుల్లో ఆ మూడు రాశులకు మారిపోనున్న దశ, ఊహించని ధనలాభం, అన్నింటా విజయమే
Mercury transit: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాడు. హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వివిధ గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులకు దశ మార్చేస్తుంది.
హిందూ పంచంగం ప్రకారం బుధుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 3 రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. కేవలం 13 రోజుల తరువాత ఈ మూడు రాశుల వారికి దశ తిరగనుంది. ఊహించని డబ్బు లభిస్తుంది. విజయం వెతుక్కుంటూ వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఓ నిర్ధిష్ట సమయంలో రాశి మారుతుంటుంది. బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల త్వరగా రాశి మారుతుంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన బుధ గోచారంతో కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. కుంభరాశి అనేది శనికి మూల త్రికోణ రాశి కావడంతో..శనిగ్రహం కుంభరాశిలోనే ఉండి అస్థిత్వం కోల్పోయి ఉంటాడు. తిరిగి మార్చ్ 6వ తేదీన ఉదయించనున్నాడు. అంతకుముందు బుధ గ్రహం కుంభరాశిలో ప్రవేశిస్తాడు. దీనివల్ల అందరి జీవితంలో కీలక ప్రభావం కన్పిస్తుంది. బుధుడి రాశి పరివర్తనం ప్రజల కెరీర్, వ్యాపారం, ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడి గోచారంతో ఏయే రాశులకు శుభసూచకమో తెలుసుకుందాం..
వృషభ రాశి
బుధ గ్రహ గోచారం వృషభ రాశి జాతకుల కెరీర్‌కు చాలా మంచిది. ఉద్యోగంలో కీలక మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగాల్లో చేరవచ్చు. కోరిన జీతం, పదవి లభిస్తుంది. మీ బాధ్యతలపై ప్రభావం పడుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలం. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
సింహరాశి
బుధుడు రాశి పరివర్తనం సింహ రాశి వారికి అత్యంత లాభదాయకం కానుంది. ఈ జాతం వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. పరస్పరం ప్రేమ, ఒకరిపై మరొకరికి నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభాలుంటాయి. ఉద్యోగం చేసేవారు రాణిస్తారు. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. భాగస్వామ్యంలో పనిచేసేవారికి మంచి సమయం.
మకర రాశి
మకరరాశికి అధిపతి శని. బుధుడు శని రాశిలో ప్రవేశించనున్నాడు. మకర రాశివారికి ఈ సమయం అత్యంత లాభదాయకం. ఈ జాతకులకు ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక వ్యవహారాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. పాత పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి.
Also read: Surya Mahadasha 2023: సూర్య మహాదశ అంటే ఏమిటి? ఇది మీ జాతకంలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook