Surya Mahadasha 2023: సూర్య మహాదశ అంటే ఏమిటి? ఇది మీ జాతకంలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసా?

Surya Mahadasha 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య భగవానుడి మహాదశ 6 సంవత్సరాలు కొనసాగుతుంది. దాని యెుక్క ప్రయోజనాలేంటో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 04:21 PM IST
Surya Mahadasha 2023: సూర్య మహాదశ అంటే ఏమిటి? ఇది మీ జాతకంలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసా?

Surya Mahadasha 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, అన్ని గ్రహాల మహాదశ మరియు అంతర్దశ ప్రతి వ్యక్తి జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీపై గ్రహం యెుక్క మహాదశ కొనసాగి.. మీకు సంబంధించిన ఫ్లానెట్ శుభస్థానంలో ఉంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు. సాధారణంగా సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. లీడర్ షిప్, ​​ఆత్మవిశ్వాసం, విజయం, గౌరవం మరియు ఆరోగ్యానికి కారకుడిగా సూర్యభగవానుడిని భావిస్తారు. మీ జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి పాలిటిక్స్ మంచి పదవిని పొందుతాడు. 

కామన్ గా సూర్య భగవానుడి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఇది మీపై కొనసాగుతుంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనేక విజయాలు సాధిస్తారు. మీరు కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన డబ్బును పొందుతారు. జాతకంలో సూర్యభగవానుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు రాజకీయాల్లో రాణిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. మీ ఫ్యామిలీతో సంబంధాలు మంచిగా ఉంటాయి. 

సూర్యుని మహాదశ నివారణలు
** జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య భగవానుని అనుగ్రహం పొందడానికి ప్రతి ఆదివారం రాగి మరియు గోధుమలను దానం చేయండి.
** రాగి పాత్రలో రోలీ మరియు అక్షతలను కలిపి సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. 
**  ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజూ చదవాలి. అంతేకాకుండా సూర్య భగవానుడి బీజ మంత్రమైన ఓం హ్రాన్ హ్రీన్ హ్రోం స: సూర్యాయ నమః పఠించడం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. 

Also Read: Malavya Rajyog: మరో 48 గంటల్లో ఈ రాశుల ప్యూచర్ మారనుంది... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News