Mercury Transit 2023: ఈ 3 రాశులకు మరో 38 రోజుల వరకూ ఊహించని డబ్బు,, అంతా అదృష్టమే
Mercury Transit 2023: గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇదే రాశి పరివర్తనం లేదా గోచారం. హిందూ జ్యోతిష్యంలో గ్రహాల గోచారానికి మనిషి జాతకానికి సంబంధముంది. అందుకే ప్రతి రోజూ లేదా వారం వారం జాతకం మారుతుంటుందంటారు..
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుదుడిని గ్రహాల రాజకుమారుడిగా భావిస్తారు. బుధుడు ఇప్పటికే మేష రాశిలో ప్రవేశించాడు. జూన్ 7 వరకూ అదే రాశిలో ఉంటాడు. ఫలితంగా బుధుడి కటాక్షంతో మూడు రాశులకు ఊహించని రీతిలో ధనవర్షం కురిపించనున్నాడు. ఆ వివరాలు మీ కోసం..
బుధుడి గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. బుదుడిని వ్యాపారం, బుద్ది, తర్కం, ఆర్దికం, గణితానికి అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న బుధుడు జూన్ 7 వరకూ అదే రాశిలో ఉండటం వల్ల మూడు రాశులు ఊహించని లబ్ది పొందనున్నాయి. బుధుడి కటాక్షంతో కలలో సైతం ఊహించని డబ్బులు వచ్చి పడనున్నాయి. ఫలితంగా ఈ మూడు రాశులకు ఆర్దికంగా ఏ విధమైన సమస్యలు తలెత్తవు. ప్రతి రంగంలో తమదైన ముద్రతో విజయం సాధిస్తారు.
మిథున రాశి
బుధుడి రాశి పరివర్తనం ప్రభావంతో ఈ రాశివారికి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే. ఈ రాశికి అధిపతి బుధుడే అయినందున ఈహించని ధనలాభం కలగనుంది. ఈ రాశి గోచారం కుండలి 11వ పాదంలో ఉంటుంది. ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్దికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులకు అనువైన సమయం.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు బుధుడి గోచారం ప్రభావంతో కలలో కూడా ఊహించని విధంగా కనకవర్షం కురుస్తుంది. సంతాన యోగం కూడా ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి , వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. అరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏ విధమైన ఇతర సమస్యలు పెద్దగా ఉండవు. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మేష రాశి
బుధ గ్రహం రాశి పరివర్తనం ప్రభావంతో మేష రాశి జాతకులకు ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఏ విధమైన ఇబ్బందులుండవు. మీతో పాటు మీ జీవిత భాగస్వామికి సైతం ఉద్యోగాల్లో పదోన్నతి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. పెళ్లికానివారికి ఆ ముచ్చట తీరిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Also read: Planets Transit 2023: ఇవాళ్టి నుంచి మే 14 వరకూ 5 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook