Budh Planet Transit In Kumbh 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహ గమనంలో మార్పు కొందరికి సానుకూలంగానూ, మరి కొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. 24 గంటల తర్వాత బుధ గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించనుంది. ఈ మెర్క్యూరీ యెుక్క సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభ రాశి
మెర్క్యురీ యొక్క సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. బుధుడి అనుగ్రహం వల్ల మీరు ఏ పని చేపట్టినా దానిని విజయంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టాలనుకునేవారికి ఈ సమయం బాగుంటుంది. వ్యాపారులు తమ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 
మేషం
మెర్క్యురీ యొక్క రాశి మార్పు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి 11వ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. మీకు ఆస్తి లావాదేవీలు లాభిస్తాయి.
మిథునం
మెర్క్యురీ ట్రాన్సిట్ మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతోంది. ఈ సమయంలో మీకు అదృష్టం పట్టనుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది.


Also Read: Budh Gochar 2023: రేపటి నుండి ఈరాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook