బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. మొత్తం తొమ్మిది గ్రహాల్లో బుద్దివంతమైన, విజ్ఞానవంతమైన గ్రహం బుధుడని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతారు. అందుకే కుండలిలో బుధుడి స్థితిని బట్టి వివిధ రాశుల జాతకం ఆధారపడి ఉంటుంది. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఆ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరైనా వ్యక్తి కుండలిలో బుధుడు బలహీన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి రంగంలో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు ఎప్పుడు రాశి పరివర్తనం చెందినా..ఆగిపోయిన జీవితాలు తిరిగి ప్రారంభమౌతాయని నమ్మకం. సంబంధిత వ్యక్తులకు అన్ని విజయాలు లభిస్తాయి. మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ గోచారం కారణంగా 5 రాశులకు ఊహించని ధనలాభం కలగనుంది. 


బుధ గోచారంతో ప్రభావితమయ్యే రాశులు


కర్కాటక రాశి


బుధుడి గోచారం జీవితంలో సానుకూల పరిణామాల్ని తీసుకొస్తుంది. కెరీర్‌లో ఉత్సాహంతో ముందుకెళ్లి అన్ని లక్ష్యాల్ని పూర్తి చేస్తారు. పని నిమిత్తం విదేశాలకు వెళ్లైవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. టీచర్లు, కౌన్సిలర్లు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు అందరికీ ఇది అనుకూలమైన సమయం. కెరీర్‌లో వృద్దితో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.


వృశ్చిక రాశి


వైద్యరంగంలో పనిచేసేవారు వృత్తి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. పోలీసు శాఖలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ఆశించిన విజయం లభించదు. ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుంటాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి.


మేష రాశి


బుధుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి చాలా బాగుంటుంది. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినవారికి చాలా కలిసొస్తుంది. మీడియా తదితర రంగాలకు చెందిన వ్యక్తులకు బాగుంటుంది. మార్కెటింగ్, ఫైనాన్స్, కౌన్సిలింగ్, రచన రంగాల వ్యక్తులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సహచరులతో వాగ్వాదం జరగవచ్చు. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పాడయ్యే అవకాశాలున్నాయి.


కుంభరాశి


ఉద్యోగ, వ్యాపారంలో ఉండేవారికి పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు ఆశించిన ఫలితాలుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.


మిధున రాశి


బుధుడి గోచారంతో మీ వృత్తి జీవితం సక్సెస్ అవుతుంది. ఈ సమయంలో వ్యాపారపరంగా చాలా ఒప్పందాలు చేసుకుంటారు. చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. 


Also read: Venus transit 2023: శుక్రుడు మేషరాశి ప్రవేశం.. హోలీ తర్వాత ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook