Budh Gochar 2023: జూన్ లో బుధుడి సంచారంతో ఈ రాశులకు సమస్యలు.. ఇందులో మీరున్నారా?
Budh Gochar 2023 effect: జూన్ లో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి రాశిలో మెర్క్యూరీ సంచారం సమయంలో రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా మెర్క్యూరీని పిలుస్తారు. జూన్ రెండో వారంలో బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. వచ్చే నెల 07, రాత్రి 7.58 గంటలకు తన మిత్రుడి రాశిలోకి గ్రహాల యువరాజు ప్రవేశించబోతున్నాడు. జూన్ 24 వరకు వృషభరాశిలోనే బుధుడు సంచరిస్తాడు. అనంతరం మిథునరాశిలోకి ఎంటర్ అవుతాడు. వృషభరాశిలో బుధుడి సంచారం సమయంలో ముఖ్యంగా కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి
వృషభరాశిలో బుధుడి సంచారం వల్ల మిథునరాశి వారికి సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడతారు. మీకు ప్రతి పనిలో అడ్డంకులే వస్తాయి. మీ కెరీర్ అంతగా బాగుండదు. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. ఈ టైంలో ఎవరికీ అప్పు ఇవ్వదు, పెట్టుబడి పెట్టొద్దు. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది
పరిహారం: బుధుడి ప్రతికూల ప్రభావం నుండి బయటపడాలంటే బుధవారం ఉపవాసం ఉండి మీరు గణపతిని పూజించండి. అంతేకాకుండా 21 ముడుల దూర్వా మరియు మోదకం సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ దూరమవుతాయి.
సింహరాశి
సింహ రాశికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. పైగా బుధగ్రహంతో స్నేహంగా ఉంటాడు. వృషభరాశిలో బుధుడి సంచారం మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారులు భారీగా నష్టాలను చవిచూస్తారు. కాబట్టి బిజినెస్ చేసేవారు జూన్ 7 నుండి 24 వరకు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. మీకు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోండి.
పరిహారం: బుధవారం ఉపవాసం ఉండి.. ఓం బ్రాం బ్రిం బ్రౌం సః బుధాయ నమః అనే బీజ మంత్రాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది. విష్ణువును ఆరాధించండి.
Also Read: Poison Yogam: మీ జాతకంలో విష యోగం ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి