Vish Yog 2023 effect and Remedies: గ్రహాలు కాలానుగుణంగా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇలాంటి యోగాలలో విష యోగం ఒకటి. ఆస్ట్రాలజీలో దీనిని చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. ఏ వ్యక్తి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో వీరు అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. కుండలిలో శని మరియు చంద్ర గ్రహాలు కలిసినప్పుడు విషయోగం రూపొందుతుంది.
విష యోగం దుష్ఫలితాలు
ఎవరి జాతకంలో ఈ విష యోగం ఉంటుందో వారు మానసికంగా ఒత్తిడికి గురికావడం, ఆందోళనం చెందడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు అనారోగ్యం బారిన పడతారు. వీరు కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. ప్రేమికుల మధ్య గొడవలు వస్తాయి. అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీరు మెుదలుపెట్టిన పనులు ఆగిపోతాయి.
ఈ పరిహరాలు చేయండి
** మీ కుండలిలో విష యోగం రూపొందినట్లయితే.. సోమ, శనివారాల్లో శివుడిని, శని దేవుడిని ఆరాధించండి. అంతేకాకుండా శివచాలీసా జపించండి.
** ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం శని దేవాలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగిస్తే విషయోగ ప్రభావం తగ్గుతుంది.
** కొబ్బరికాయను తీసుకుని దానిని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఓ చెట్టు కింద పగలగొట్టండి. దానిని అందరికీ ప్రసాదంగా పంచండి.
** జాతకంలో విష యోగం ఏర్పడినట్లయితే.. మీరు ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయండి. అంతేకాకుండా మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి.
Also read: Last Surya Grahan: ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు? ఇండియాలో సూతక్ కాలం చెల్లుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి