Budh Gochar 2022: తులరాశిలో బుధుడి సంచారం.. దీపావళి తర్వాత ఈ రాశులకు భారీ నష్టం...
Budh Gochar 2022: బుధుడు తులారాశిలో ప్రవేశించబోతున్నాడు. ఇది మొత్తం 12 రాశుల మీద పెను ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా తులరాశిలో బుధుడి సంచారం నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Budh Gochar 2022: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఇవాళ అంటే అక్టోబరు 20న కన్యారాశిలో అస్తమించనున్నాడు. అనంతరం అక్టోబరు 26న తులరాశిలోకి (Mercury transit in Libra 2022) ప్రవేశించనున్నాడు. బుధుడు నవంబరు 19 వరకు అక్కడే ఉండనున్నాడు. తులారాశిలో బుధుడు.. సూర్యుడు, శుక్రుడు, కేతువుతో కలవనున్నాడు. దీని ప్రభావం నాలుగు రాశులవారిపై ప్రతికూలంగా ఉండనుంది. దీంతో వీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. భారీ మెుత్తంలో డబ్బును కోల్పోవచ్చు. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అంతేకాకుండా ప్రమాదాల బారిన కూడా పడే ప్రమాదం ఉంది.
ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
వృషభం (Taurus): తులారాశిలో బుధుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా వీరు చర్మం, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి.
వృశ్చిక రాశి (Scorpio): బుధుడు రాశి మార్పు ప్రభావం వృశ్చికరాశి వారిపై ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. డబ్బు సంబంధిత లావాదేవీలు జరుపకుండా ఉంటే మంచిది. ఆఫీసులో మీకు శత్రువులు తయారవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండటం అవసరం.
కుంభ రాశి (Aquarius): కుంభ రాశి వారు తులారాశిలో ప్రవేశించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరుగుతున్న ఖర్చులు ఒత్తిడిని కలిగిస్తాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం రాదు. కుటుంబంలో గొడవలు మెదలవుతాయి. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబ్టటి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Solar Eclipse 2022: మరో 5 రోజుల్లో సూర్యగ్రహణం.. హైదరాబాద్ లో ఎన్ని నిమిషాలు కనిపిస్తుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook