Mercury Transit 2023: ఆగస్టు 21న కీలక పరిణామం.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
Budh Gochar 2023: ఈ నెలలో బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. మెర్క్యూరీ రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా దీని సంచారం మూడు రాశులవారికి కలిసి రానుంది.
Benefits of Bhadra Rajyog 2023: ఆస్ట్రాలజీలో మెర్క్యూరీని ప్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఇతడి స్థానంలోని మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల యువరాజు అయిన బుధుడు ఈ నెల 21న కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా ఈరాశికి అధిపతి కూడా బుధుడే. ఏడాది తర్వాత గ్రహాల రాకుమారుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబరు 02 వరకు ఇదే రాశిలో ఉండనున్నాడు. కన్యారాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల అరుదైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడనున్నారు. మెర్క్యురీ ట్రాన్సిట్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ 3 రాశులకు వరం
మకరం: భద్ర రాజయోగం మకర రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు.
కన్య: ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టనర్‌షిప్‌తో పనిచేసేవారు ప్రయోజనం పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనుస్సు: బుధ సంచారం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook